గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్ శంకర్... అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో టెలిఫోన్లో సంభాషించారు. ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యపై అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. భారత్ ఈ విషయంలో ఆందోళన చెందుతున్నట్లు ఆయన తెలిపారు.
గల్ఫ్ ప్రాంతంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో సాయంత్రం టెలిఫోన్ సంభాషణలు జరిపాను. భారత్ ఈ విషయంపై ఆందోళన చెందుతోందని తెలియజేశాను.
జయ్శంకర్, భారత విదేశాంగ మంత్రి
ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్తో కూడా జయ్శంకర్ సంభాషించారు. వారి దేశంలో ఉద్రిక్తతల గురించి భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే సమర్థిస్తుందని జయ్శంకర్ వ్యాఖ్యానించారు.