ETV Bharat / bharat

అమెరికా నుంచి భారత్​కు మరో 100 వెంటిలేటర్లు - US Ventilators today news

కరోనా కట్టడి కోసం అమెరికా ప్రభుత్వం.. భారత్​కు మరో 100 వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది. ఈ అత్యాధునిక పరికరాల ద్వారా కొవిడ్​ రోగులకు మరింత నాణ్యమైన చికిత్స అందించవచ్చని తెలిపింది.

US hands over second shipment of 100 ventilators to India in COVID-19 assistance
భారత్​కు మరో 100 వెంటిలేటర్లను పంపిన అగ్రరాజ్యం
author img

By

Published : Aug 19, 2020, 7:29 PM IST

కరోనాపై పోరులో భాగంగా అమెరికా.. భారత్​కు మరో 100 వెంటిలేటర్లను విరాళంగా పంపింది. దేశంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు సాయమందిస్తున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. అధునాతన సౌకర్యాలతో తమ దేశంలో తయారైన ఈ వెంటిలేటర్ల ద్వారా కరోనా రోగులకు మరింత నాణ్యమైన చికిత్సను అందించవచ్చని యూఎస్​ రాయబార కార్యాలయం వెల్లడించింది.

రెడ్​క్రాస్​ సమన్వయంతో..

ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ సమన్వయంతో.. యూఎస్​ ఏజెన్సీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​(యూఎస్​ఏఐడీ) ద్వారా ఈ వెంటిలేటర్లను భారత్​కు పంపింది అమెరికా ప్రభుత్వం. వెంటిలేటర్లతో పాటు వాటి ఆపరేటింగ్​కు సంబంధించిన ప్యాకేజీ ట్యూబ్​లు, ఫిల్టర్లు, ఇతర సామగ్రికి అవసరమైన నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపింది.

మొత్తం 200 వెంటిలేటర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించిన అగ్రరాజ్యం.. తొలిదశలో భాగంగా 100 వెంటిలేటర్లను జూన్​ 14న భారత్​కు పంపింది.

ఇదీ చదవండి: హైజాక్ కథ సుఖాంతం- ప్రయాణికులందరూ సేఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.