ETV Bharat / bharat

టార్గెట్​ చైనా: భారత్​కు మరో 5 యుద్ధ హెలికాప్టర్లు - Chinook military helicopters news

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ మరో 5 అపాచీ హెలికాప్టర్లను అందించింది. ఒప్పందంలో భాగంగా భారత్​కు అందించాల్సిన 22 అపాచీ, 15 చినూక్​ హెలికాప్టర్ల డెలివరీ పూర్తయినట్లు తెలిపింది. కొత్తగా భారత్​కు అందిన ఐదు అపాచీ హెలికాప్టర్లను చైనా సరిహద్దులో మోహరించనున్నట్లు తెలిపారు అధికారులు.

military helicopters to India
భారత అమ్ములపొదిలోకి 37 యుద్ధ విమానాలు!
author img

By

Published : Jul 10, 2020, 6:48 PM IST

Updated : Jul 10, 2020, 7:30 PM IST

చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ భారత అమ్ములపొదిలోకి మరో ఐదు అపాచీ హెలికాప్టర్లు చేరాయి. అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సిన 22 హెలికాప్టర్లలో తుది ఐదింటిని భారత వైమానిక దళానికి అందించింది.

ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున.. కొత్త వాటినీ అదే ప్రాంతంలో మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఐదేళ్లకు...

22 అపాచీ, 15 చినూక్​ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2015 సెప్టెంబర్​లో బోయింగ్​ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్​.

military helicopters to India
చినూక్​ హెలికాప్టర్​

కొత్తగా 5 హెలికాప్టర్ల రాకతో... ఒప్పందం ప్రకారం అందించాల్సిన 22 అపాచీ, 15 చినూక్​ సైనిక హెలికాప్టర్ల డెలివరీ పూర్తయినట్లు తెలిపారు బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఎండీ సురేంద్ర అహుజ.

"సైనిక హెలికాప్టర్లు అందించటం ద్వారా మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. వైమానిక దళ అవసరాలకు తగిన సామగ్రిని అందించేందుకు భారత్​తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఏహెచ్​-64ఈ అపాచీ హెలికాప్టర్లలో ఆధునాతన టార్గెటింగ్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా పగలే కాదు రాత్రిళ్లు కూడా లక్ష్యాన్ని గుర్తించవచ్చు. భూమిపై, గాలిలోనే కాదు సముద్ర వాతావరణంలోనూ పనిచేయగలిగేలా ఫైర్​ కంట్రోల్​ రాడార్​ను​ నవీకరించాం. కమాండర్ల అవసరాలను తీర్చేందుకు ఇది ఉపయోగపడుతుంది."

- సురేంద్ర అహుజ, ఎండీ-బోయింగ్​ డిఫెన్స్​ ఇండియా

ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక బహుళ ప్రయోజనకర యుద్ధ హెలికాప్టర్లలో ఏహెచ్​-64ఈ అపాచీ ఒకటి. ఇప్పటికే అమెరికా సైన్యంలో వినియోగంలో ఉంది. చినూక్​ అనేది బహుళ పాత్ర పోషించే, ఉన్న చోటి నుంచే గాల్లోకి ఎగరగల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్. వీటిని ప్రధానంగా బలగాలు, యుద్ధ సామగ్రి, ఇంధనాన్ని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనలో భాగంగా మరో 6 అపాచీ హెలికాప్టర్ల కోసం ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఇదీ చూడండి:సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ

Last Updated : Jul 10, 2020, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.