ETV Bharat / bharat

రాజకీయాల్లోకి రంగీలా... ముంబయి నుంచి పోటీ! - rahul

తొంభైల్లో రంగీలా చిత్రంతో యావద్దేశాన్ని ఉర్రూతలూగించిన అందాల నటి ఊర్మిళ కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఊర్మిళా మతోండ్కర్.

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరిన ఊర్మిళ
author img

By

Published : Mar 27, 2019, 4:09 PM IST

Updated : Mar 27, 2019, 4:34 PM IST

బాలీవుడ్ అందాల తార ఊర్మిళా మతోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. దిల్లీలో రాహుల్​తో సమావేశం అనంతరం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఊర్మిళ. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ఊర్మిళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి ఊర్మిళ లోక్​సభ బరిలో నిలిచే అవకాశం ఉంది.

కాంగ్రెస్​లో చేరిక సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగడ్తల్లో ముంచెత్తారు ఊర్మిళ. దేశానికి ప్రస్తుతం రాహుల్ వంటి నాయకుడి అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లుగా భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆరోపించారు ఈ అందాల తార. ప్రజల పక్షంలో నిలిచి పోరాడేందుకే రాజకీయాల్లో అడుగుపెట్టానని చెప్పారు.

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరిన ఊర్మిళ

"నా వ్యక్తిత్వం మహాత్మగాంధీ, జవహర్​లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ సిద్ధాంతాలతో ఏర్పడింది. అన్నింటికంటే పెద్ద అంశం స్వేచ్ఛ. ఏం చేయాలనుకున్నా.. ఏదైనా చెప్పాలనుకున్నా... ఎలాంటి జీవితం జీవించాలనుకున్నా స్వేచ్ఛ అవసరం. ఆలోచించే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అవసరమనిపిస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయి. భారత్​లోని పౌరుల మనసుల్లో అనేక ప్రశ్నలున్నాయి. వారి తరఫున పోరాడేందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సినీ తారలు రాజకీయాల్లోకి వస్తే వారి గ్లామర్​ కోసం, వారి పేరు కోసం, ప్రజల్ని తమ వైపు లాక్కునేందుకే అనుకుంటారు. అలా ఆలోచించడం తప్పేమీ కాదు. నా విషయంలో దయచేసి ఆలోచించొద్దు. ఎన్నికలు వచ్చినందుకు నేను పార్టీలో చేరలేదు. ఎన్నికల అనంతరం నేను పార్టీని విడిచిపోను. నేను కాంగ్రెస్​లో ఉండేందుకే వచ్చాను. కాంగ్రెస్ సిద్ధాంతాల్ని నమ్మే పార్టీలో చేరాను."

-ఊర్మిళ, బాలీవుడ్ నటి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 27, 2019, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.