ETV Bharat / bharat

కరోనా ఉన్మాదం: బాధితుల మూత్రం సీసాలు విసిరి... - Case of coronavirus in india

దిల్లీలోని కరోనా నిర్బంధ కేంద్రం వద్ద బాధితుల మూత్రం నింపిన సీసాలు కలకలం రేపాయి. కొందరు దురుద్దేశపూర్వకంగానే వాటిని విసిరేశాన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

virus
బహిరంగ ప్రదేశాల్లో వైరస్ బాధితుల మూత్రం.. కేసు నమోదు
author img

By

Published : Apr 8, 2020, 4:08 PM IST

దిల్లీలో నిర్బంధ కేంద్రంలోని బాధితుల మూత్రాన్ని సమీపంలోని జనావాస ప్రదేశంలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ద్వారకా సెక్టార్ 16లోని ఓ ప్రాంతంలోని పంప్​ హౌస్​ వద్ద బాధితుల మూత్రం నింపిన బాటిళ్లు ఉన్నాయని నిర్బంధ కేంద్రంలో పనిచేసే ఓ ఉద్యోగి గుర్తించాడు. అనంతరం ఈ అంశమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

"నిర్బంధ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి మా వద్దకు వచ్చాడు. నిర్బంధ కేంద్రంలోని మూత్రం సీసాలు బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లు చెప్పాడు. ఈ సీసాలను నిర్బంధ కేంద్రంలోని అనుమానితులే విసిరి ఉంటారని అనుకుంటున్నాం."

-పోలీసుల ఎఫ్​ఐఆర్ నివేదిక

ఇలా మూత్రాన్ని పారబోయడం వెనక దురుద్దేశాలు దాగి ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నాడు పిటిషనర్.

బహిరంగ ప్రదేశాల్లో వైరస్ బాధితుల మూత్రం

ఇదీ చూడండి: కరోనా సంక్షోభంలో అసలైన హీరోలు వారే: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.