ఉత్తర్ప్రదేశ్ లఖీమ్పుర్-ఖీరీ జిల్లాకు చెందిన అల్కాబాజ్పేయీ కల 50 ఏళ్ల వయసులో నెరవేరింది. పెళ్లయిన పాతికేళ్లకు యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో అర్హత సాధించి ఎంతో మందికి ఆమె స్ఫూరినిచ్చారు. మహిళాసాధికారతకు నిదర్శనంగా నిలిచారు.
" నేను గాంధీజీ సిద్ధాంతాలను నమ్ముతాను. వాటిపై ఎన్నో పుస్తకాలను చదివాను. ఆ బాటలోనే నెట్ పరీక్షకు సన్నద్ధమయ్యాను. ఇద్దరు పిల్లలతో పరీక్షకు చదవటం కష్టంగా ఉండేది. 2009లో సైకాలజీలో పీజీ పూర్తి చేశాను. పిల్లలు పైచదువులకు వెళ్లడం వల్ల నేను మళ్లీ చదవడం ప్రారంభించాను. ఈ విజయంలో నా భర్త, పిల్లల సహకారం ఎంతో ఉంది."
--ఈటీవీ భారత్తో అల్కా బాజ్పేయీ.
పాతికేళ్లుగా ఒకటే లక్ష్యం
గతంలో రెండు సార్లు నెట్ పరీక్ష రాసిన అల్కా..అర్హత సాధించలేదు. అప్పటినుంచి పరీక్ష కోసం పట్టుదలతో చదవటం ప్రారంభించారు. ఓ వైపు ఎం.ఏ చదువుతూనే పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకరు పీహెచ్డీ కోసం శిక్షణ పొందుతుండగా, మరొకరు ఇదివరకే యూజీసీ-నెట్ పరీక్షలో విజయం సాధించారు.
ఇదీ చదవండి : పెంపుడు శునకాలకు 'ప్రత్యేక వసతి గృహం'