ETV Bharat / bharat

ప్రియాంకపై దాడి అవాస్తవం: యూపీ పోలీస్ - ప్రియాంక గాంధీ వార్తలు

తనపై పోలీసులు దాడి చేశారని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. ప్రియాంక చేసిన వాదనలు అవాస్తవమని స్పష్టం చేశారు.

UP Police rejects Priyanka Gandhi's manhandling allegations
ప్రియాంకపై దాడి అవాస్తవం: యూపీ పోలీస్
author img

By

Published : Dec 29, 2019, 5:16 AM IST

పోలీసులు తనపై దాడి చేశారని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలను ఖండించారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. పోలీసులు దాడి చేశారన్న వాదనల్లో నిజం లేదని వెల్లడించారు.

పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో అరెస్టైన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబాన్ని కలిసేందుకు శనివారం సాయంత్రం ప్రియాంక గాంధీ వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు తన మెడపట్టుకుని నెట్టితే కిందపడిపోయినట్లు ప్రియాంక ఆరోపించారు.

ప్రియాంక గాంధీపై పోలీసులు దాడి చేయడంపై సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని అడిషనల్​ సూపరింటెండెంట్​కు లేఖ రాశారు.. పోలీసు అధికారిని అర్చనాసింగ్​. తన కర్తవ్యాన్ని చిత్త శుద్ధితో నిర్వర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు.

" ప్రియాంక గాంధీ యూపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి గోఖలే మార్గ్​ గ్రామానికి బయలుదేరారు. ముందుగా నిర్దేశించిన దారిలో కాకుండా ప్రియాంక గాంధీ వాహనం లోహితా మార్గం ​వైపు వెళ్లింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆ పార్టీ కార్యకర్తలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ.. వాహనం నుంచి దిగి పార్టీ కార్యకర్తలతో కలిసి నడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు."

- అర్చనా సింగ్​, పోలీసు అధికారి

Lucknow (UP), Dec 28 (ANI): Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra put allegations over Uttar Pradesh Police that she was manhandled by them. She said, "UP Police stopped me while I was going to meet family of Darapuri (former IPS). Police strangulated and manhandled me. They surrounded me while I was going on a party worker's two-wheeler, after which I walked to reach there."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.