ETV Bharat / bharat

దూబే కేసులో డీఐజీపై యూపీ సర్కార్​ వేటు

author img

By

Published : Nov 13, 2020, 6:15 AM IST

సీనియర్​ ఐపీఎస్​ అధికారి అనంత్​ దేవ్​పై సస్పెన్షన్​ వేటు వేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబేతో.. అనంత్​కు సంబంధాలున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకున్నారు.

UP govt suspends IPS officer over Kanpur ambush
వికాస్​ దూబే కేసులో డీఐజీపై యోగి సర్కార్​ వేటు

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ అనంత్ దేవ్‌పై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో కాన్పుర్ పోలీస్ చీఫ్‌గా పనిచేసిన అనంత్ దేవ్‌కి, దూబేకి సంబంధాలున్నట్టు సిట్ బృందం గుర్తించడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జులై 2న కాన్పుర్‌లోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన 8 మంది పోలీసులను వికాస్ ముఠా కాల్చిచంపింది. వికాస్ దూబేతో మరో పోలీస్ అధికారి వినయ్ తివారీకి సంబంధాలు ఉన్నాయంటూ కాల్పుల ఘటనలో మృతి చెందిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా రాసిన ఓ లేఖపై చర్యలు తీసుకోలేదని అనంత్ దేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్​ ఎన్​కౌంటర్​పై విచారణకు కమిషన్

''అనంత్ దేవ్‌ను సస్పెండ్ చేశాం. సిట్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నాం.'' అని హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ పేర్కొన్నారు. జులై 10న వికాస్ దూబేను ఉజ్జయినీ నుంచి కాన్పుర్ తరలిస్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.