హాథ్రస్ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.. సుప్రీం కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. కేసు దర్యాప్తు సరైన రీతిలో జరగడానికి సీబీఐకి అప్పగించాలని కోరింది యోగి సర్కార్. సీబీఐ దర్యాప్తును సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని అఫిడవిట్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. కేసులో ఇప్పటివరకు వచ్చిన పురోగతిని అఫిడవిట్లో వివరించింది. ముందుగా తామే కేసును సీబీఐకి బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు యూపీ సర్కార్ ప్రస్తావించింది.
కుటుంబ అనుమతితోనే..
అయితే అత్యాచార బాధితురాలి అంత్యక్రియలను రాత్రికి రాత్రే నిర్వహించడాన్ని అఫిడవిట్లో పేర్కొంది. ఉదయం సమయంలో పెద్దఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఆమె కుటుంబ అనుమతితోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు పేర్కొంది.