ETV Bharat / bharat

'విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా యూపీ' - 104 IAS officers letter to up cm

విద్వేష రాజకీయాలకు ఉత్తర్​ప్రదేశ్ ప్రధాన కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ 104 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు లేఖ రాశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన పలు దాడులను ప్రస్తావించారు.

former ias officers letter to up cm
యోగి ఆదిత్యనాథ్
author img

By

Published : Dec 30, 2020, 6:31 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో నెలకొన్న తాజా పరిస్థితులపై 104 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మత మార్పిడిలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని(ఆర్డినెన్సు) వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

రాష్ట్రంలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన పలు దాడులను అందులో ప్రస్తావించారు. సీఎం సహా రాష్ట్రంలోని చాలా మంది రాజకీయ నేతలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు.

తాజా లేఖపై సంతకం చేసినవారిలో జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్ మీనన్, విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి నిరుపమ రావ్ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: మతాంతర వివాహం తప్పేమీ కాదు: హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.