కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. దాన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుపరిచినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ పత్రిక సంపాదకులు ఫహద్ హుస్సేన్ తెలిపారు.
పాకిస్థాన్ జనాభాతో దాదాపు సమానంగా(పాకిస్థాన్ 20కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 22కోట్ల జనాభా) ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రతను పాకిస్థాన్‌తో పోల్చిచూసింది. దీనిలో భాగంగా కరోనా మరణాల రేటు పాకిస్థాన్‌లో కంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోనే తక్కువని ఫహద్ హుస్సేన్ పేర్కొన్నారు. అదే దాదాపు 11కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మాత్రం కరోనా మరణాల రేటు పాకిస్థాన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ రాష్ట్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల కారణమే అక్కడ వైరస్ అదుపులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ను అడ్డుకట్ట వేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ వ్యవహరించిన విధానమే సరియైందని స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అదే జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్, అత్యధిక తీవ్రత ఉన్న మహారాష్ట్ర రాష్ట్రాలు వైరస్ పోరులో అనుసరిస్తున్న తీరుపై విశ్లేషించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ తీరును వివరిస్తూ రాసిన ‘మెసేజ్ విత్ మ్యాటర్’ వ్యాసం అనంతరం భారత్‌లోని రాష్ట్రాలతో పోల్చుతూ వైరస్‌ను నియంత్రిస్తున్న తీరును పోల్చారు. ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే లక్షకు పైగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. అత్యధిక కరోనా తీవ్రత ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 15వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో లక్షా మూడువేల పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 2067మంది మృత్యువాతపడ్డారు.
ఇదీచూడండి:రసాయనాలపై నిషేధం సరే- ప్రత్యామ్నాయం ఏది?