బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. భాజపా తరఫున ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ర్యాలీ ప్రారంభం కానుంది. రోజుకు సగటున మూడు ర్యాలీలతో మొత్తం 18 చోట్ల ప్రసంగించనున్నారు యూపీ సీఎం.
"బిహార్‌లో యోగికి మంచి పేరుంది. ముఖ్యంగా యూపీ- బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ. సీఎం.. తరచూ అక్కడి గోఖర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తుండటం వల్ల.. అక్కడివారు ఆయన్ను అమితంగా గౌరవిస్తారు. అందుకోసం బిహార్ ఎన్నికలకు ఆరు రోజులు కేటాయించారు యోగి. యూపీలోనూ 7స్థానాల్లో ఉప ఎన్నికలు సహా.. మొత్తం 10 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీలును బట్టి మరికొన్ని రోజులు సీఎం బిహార్‌లోనే ఉండాల్సి వస్తుంది."
- భాజపా కార్యదర్శి
తొలిరోజు అక్కడి నుంచే..
ప్రచారంలో భాగంగా.. తొలి రోజు రామ్‌గఢ్, ఆర్వాల్, కరాకత్ నియోజక వర్గాల్లో ప్రసంగిస్తారు యోగి. మరుసటి రోజు జాముయి, తరారీ, పలియాగంజ్ ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆరు చోట్లా గతంలో సీపీఐ(ఎమ్ఎల్)-1, ఆర్జేడీ-5 సీట్లు పొందాయి.
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 12 ర్యాలీలలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇలా మొత్తం 30 మంది స్టార్ ప్రచారకులను నియమంచింది భాజపా.
ఇదీ చదవండి: ఆ చెత్తకుండీలో రూ. 2వేల నోట్లు.. చివరికి!