దేశంలో నానాటికీ పెరుగుతున్న అసహనం, మతపరమైన విభజన, హింసతో రాజ్యాంగానికి నష్టం జరుగుతోందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్న ఇలాంటి ఉదంతాలను సహించకూడదని అభిప్రాయపడ్డారు.
రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా దిల్లీలో రాజీవ్ యూత్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మన్మోహన్. రాజ్యాంగానికి నష్టం చేసే చర్యలకు అడ్డుకట్ట వేయడానికి దేశ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
'భారత్‌ను ఎవరూ విభజించలేరు. లౌకికవాదమే మన జాతీయవాదం. అది సహనానికి మించినది. ఏ మతం కూడా హింసను బోధించదు. స్వార్థపరమైన ఆలోచనలు ఎంతో ప్రమాదకరం. ఇలాంటివే దేశవిభజనకు దారి తీస్తాయి.'
- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
ఇదీ చూడండి: ఫేస్బుక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పదా?