ETV Bharat / bharat

అమెరికా కోడి 'కాలు' దువ్వుతోంది! - భారత్​కు రానున్న ట్రంప్

అమెరికాలో చికెన్‌లెగ్స్‌ (కోడికాళ్లు)ను ఎక్కువగా తినరు. ఛాతీభాగాన్ని బాగా ఇష్టపడతారు. దానివల్ల ఆ దేశంలో చికెన్‌లెగ్స్‌ కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటిని సుదీర్ఘకాలంగా నిల్వచేస్తున్న అమెరికా ఇప్పుడు భారత్‌, మరికొన్ని వర్ధమాన, పేద దేశాలకు విక్రయించాలని చూస్తోంది. భారత పర్యటనకు విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఈ మేరకు మన దేశంతో పరిమిత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. దీనివల్ల దేశీయ కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుందని, లక్షలమంది ఉపాధిని కోల్పోతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

chicken legs
చికెన్ లెగ్స్
author img

By

Published : Feb 15, 2020, 7:49 AM IST

Updated : Mar 1, 2020, 9:32 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో భారత్‌లో కాలు మోపబోతున్నారు. తనతో పాటే కోడి కాళ్లనూ ఈ గడ్డపై మోపడానికి సమాయత్తమయ్యారు!! ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలో ఏళ్లుగా గుట్టలుగా పేరుకుపోయిన చికెన్‌లెగ్స్‌ (కోడి కాళ్లు)ను భారత్‌కు విక్రయించే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇందుకు సిద్ధపడిన భారత్‌- చికెన్‌ లెగ్‌లపై ఉన్న 100 శాతం దిగుమతి సుంకాల్ని 25 శాతానికి తగ్గించడానికి అంగీకరిస్తున్నట్లు సమాచారం. 10 శాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతోందట. ట్రంప్‌ పర్యటనలో దీనిపై అవగాహన కుదిరితే- రెండు దేశాలూ పరిమిత వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయొచ్చు. భారత పాడి పరిశ్రమలోకి అమెరికాను పరిమిత స్థాయిలో అనుమతించడానికీ అంగీకారం కుదరొచ్చు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోళ్ల పరిశ్రమ

అమెరికా చికెన్‌లెగ్స్‌ను దిగుమతి చేసుకుంటే ఘోరంగా నష్టపోతామని దేశీయ కోళ్ల పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనివల్ల లక్షలాది కోళ్ల ఫాంలు మూతబడతాయని, వాటిపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిని కోల్పోతారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తంచేస్తోంది.

ఆనాడే నిషేధం

బర్డ్‌ఫ్లూ కారణంతో 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)కు అమెరికా ఫిర్యాదుచేసింది. 2014 అక్టోబరులో తీర్పు అమెరికా పక్షాన వచ్చింది. అయితే ఆ తీర్పును అమలుచేయటానికి ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు అంగీకరించలేదు. చివరికి డబ్ల్యూటీవో ద్వారా అమెరికా ఒత్తిడి తేవడంతో 2017లో చికెన్‌లెగ్స్‌ దిగుమతికి భారత్‌ అంగీకరించింది. మనదేశంతో వాణిజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి ట్రంప్‌ వస్తున్నారు. రెండుదేశాల మధ్య 2018లో 14,000 కోట్ల డాలర్లున్న వాణిజ్యాన్ని మున్ముందు 50,000 కోట్ల డాలర్లకు పెంచాలనేది రెండు దేశాల లక్ష్యం.

పాడి మార్కెట్లోకీ...

అతిపెద్దదైన భారత పాడి(డెయిరీ) మార్కెట్లోకీ అమెరికాను అనుమతించడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. దీనివల్ల దాదాపు 8 కోట్ల మంది గ్రామీణుల జీవనం గందరగోళంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో మాంసం వ్యర్థాలతో కలిపి దాణాను తయారుచేసి పశువులకు పెడుతుంటారు. అలాంటి పాడి ఉత్పత్తుల్ని భారత్‌కు దిగుమతి చేసుకోవద్దని దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దేశంలో ఇదీ కోళ్ల పరిశ్రమ

  • రూ.లక్ష కోట్లు: దేశంలో కోళ్ల పరిశ్రమ మొత్తం విలువ
  • 40 లక్షల మంది: దీని ద్వారా ఉపాధి పొందుతున్న వారు
  • 8800 కోట్లు: దేశంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు
  • 400 కోట్లు: ఉత్పత్తి అయ్యే బ్రాయిలర్స్‌
  • చికెన్‌ ఉత్పత్తిలో చైనా, బ్రెజిల్‌, అమెరికా తర్వాత భారత్‌ది నాలుగోస్థానం.

అమెరికాలో ఎందుకు తినరు?

చికెన్‌లెగ్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందన్న కారణంతో వాటిని తినడానికి అమెరికన్లు ఎక్కువగా ఇష్టపడరు. చికెన్‌ బ్రెస్ట్‌(ఛాతీభాగం)ను తినడానికే మొగ్గుచూపుతారు. ఇందుకోసం చికెన్‌ వాస్తవ ధరకు రెండున్నర రెట్లు ఎక్కువగా చెల్లించడానికీ సిద్ధపడతారు. కోడిలో కొద్దిభాగాన్నే వాడుకుని.. మిగతా భాగాన్ని పేదదేశాలతో పాటు చైనా, ఐరోపా దేశాలకు విక్రయించాలని చూస్తుంటారు. చైనా, ఐరోపాల్లో ఇప్పటికే నిల్వలు ఎక్కువగా ఉన్నందువల్ల- చికెన్‌లెగ్స్‌ను ఇష్టంగా తినే భారతీయులకు వాటిని విక్రయించే ప్రయత్నాల్ని అమెరికా చేస్తోంది.

ఇదీ చదవండి: దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ

Last Updated : Mar 1, 2020, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.