ఎక్కడైనా అధికారుల తీరును నిరసిస్తూ.. ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేయడం చూసే ఉంటాం. కానీ ఇక్కడ ఏకంగా కేంద్ర మంత్రి, భాజపా ఎంపీనే ధర్నాకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా ప్రధానాస్పత్రిలో బెడ్షీట్లు సరిగా లేవని నిరసన వ్యక్తం చేశారు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి. ప్రజల నేతగా పేరుగాంచిన ఆయన.. ప్రజల కోసం ఆందోళనకు దిగారు. వారితో కలిసి రోడ్డుపై చాలాసేపు బైఠాయించారు. దుప్పట్లు మురికిగా ఉన్నాయని.. ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఒడిశా' మోదీ...
ప్రతాప్ సారంగిని 'ఒడిశా మోదీ'గానూ పిలుస్తారు. నిరాడంబర జీవితం సాగించే ఆయనంటే జనానికి విపరీతమైన అభిమానం.
2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి పార్లమెంటు సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఆటోలో ప్రచారం చేసి.. గెలిచిన 'ఒడిశా మోదీ'