ETV Bharat / bharat

ఆ ప్రాంతాల్లోనే ప్రత్యేక కార్యకలాపాలు: కేంద్రం - కోవిడ్ -19 తాజా వార్తలు

దేశంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి ప్రత్యేక కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అయితే ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించింది కేంద్రం. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ సడలింపులు ఉంటాయని, హాట్​స్పాట్​ ప్రాంతాలు మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం దేశానికి ఎంతో ముఖ్యమైన రోజు అని అభిప్రాయపడింది కేంద్రం.

UNION HEALTH MINISTRY BRIEFING ON CORONA VIRUS OUTBREAK IN INDIA
'కేవలం ఆ ప్రాంతాల్లోనే ప్రత్యేక కార్యకలాపాలు'
author img

By

Published : Apr 19, 2020, 4:48 PM IST

కరోనాపై పోరులో భారత్​కు సోమవారం ఎంతో ముఖ్యమైన రోజుగా అభివర్ణించింది కేంద్రం. కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రత్యేక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పునరుద్ఘాటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

హాట్​స్పాట్​లు, కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని వెల్లడించింది కేంద్రం. సినిమా హాళ్లు, షాపింగ్​ మాళ్లు, ప్రార్థనా మందిరాలు మే 3వరకు తెరుచుకోవని పేర్కొంది.

వ్యాక్సిన్​ తయారీ...

వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం చర్యలు ముమ్మరం చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ వెల్లడించారు. ఈ మేరకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతాయన్నారు.

దేశంలో కొత్త కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు లవ్​ అగర్వాల్​. ఇప్పటి వరకు మొత్తం 54 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. గత 28రోజుల్లో పుదుచ్చేరి, కర్ణాటకలోని కొడగులో కేసులు వెలుగుచూడలేదని స్పష్టం చేశారు.

మొత్తం పరీక్షలు...

దేశంలో ఇప్పటివరకు 3,86,791 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎమ్​ఆర్​ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 37వేల 173 పరీక్షలు జరిపినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ముక్కు చీది లిఫ్ట్​కు తుడుస్తూ దొరికాడు.. తర్వాత...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.