ETV Bharat / bharat

సరిహద్దులో బలగాల ఉపసంహరణ తర్వాతే చర్చలు!

భారత్​-చైనాలు సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మళ్లీ చర్చలు ఉంటాయని వెల్లడించాయి.

సరిహద్దులో బలగాలు ఉపసంహరించుకుంటున్న భారత్​-చైనా!
Under the mutual disengagement, both sides will disengage and move back by 1-1.5 km from the friction points
author img

By

Published : Jul 7, 2020, 4:37 PM IST

Updated : Jul 7, 2020, 5:36 PM IST

సరిహద్ధులో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు భారత్​, చైనాలు బలగాాలను ఉపసంహరించుకుంటున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఫ్రిక్షన్​ పాయింట్ల నుంచి రెండు దేశాల సైన్యాలు 1 నుంచి 1.5కి.మీ. మేర వెనక్కి వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాతే మరోసారి చర్చలు జరపనున్నట్లు వెల్లడించాయి.

హాట్​ స్ప్రింగ్స్​, గోగ్రా ప్రాంతాలలో బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్​-చైనాలు సోమవారం నుంచే ప్రారంభించినట్లు సైనిక వర్గాలు చెప్పాయి. ఇరు వైపులా ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తవుతుందని పేర్కొన్నాయి. చైనా సైన్యం తమ నిర్మాణాలను సోమవారం నుంచే కూల్చివేయడం మొదలుపెట్టినట్లు స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: డోభాల్​ చాకచక్యంతోనే చైనా వెనక్కు తగ్గిందా?

Last Updated : Jul 7, 2020, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.