"దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీని వల్ల వైరస్ వ్యాప్తి దేశంలో గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు.. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఆంక్షల సడలింపు ప్రక్రియకు ప్రభుత్వం మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. అమెరికా చివరి త్రైమాసికంలో 4.8 శాతం మేర భారీ నష్టాలను చవిచూసింది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా 2ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించారు ట్రంప్. భారత ఆర్థిక ప్యాకేజీ చాలా స్వల్పంగా ఉంది. అయితే అది ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా గాడిన పెట్టేలా ఉంది. ఈ ప్యాకేజీ ప్రజల విశ్వాసాన్ని పొందడం కష్టమే. వ్యాపారులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు.. రిటైల్ షాపులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ వర్గాలు నష్టాల్లోకి జారిపోవడం మొదలైతే వచ్చే ఆరు నుంచి 12 నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం కష్టమవుతుంది" అని అన్నారు అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సమాఖ్య అధ్యక్షుడు ముఖేశ్ ఆఘీ. న్యూయార్క్ నుంచి 'ఈటీవీ భారత్' ప్రతినిధి స్మితాశర్మతో మాట్లాడారు.
భారత్‌లో లాక్డౌన్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని అనుకుంటున్నారు ?
లాక్డౌన్ అమలులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలకంగా వ్యవహరించారు. అధికారులు, ప్రజలు అప్రమత్తమై లాక్‌డౌన్‌ను పాటించారు. ఇది సానుకూల ప్రభావాన్ని చూపింది. అయితే ప్రస్తుతం సడలింపులు ప్రారంభమయ్యాయి. భారత్‌లో 60 శాతం ఆర్థిక వ్యవస్థ వినియోగం పైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రజలను లాక్డౌన్లో బంధిస్తే నష్టమే. నెమ్మదిగా సడలింపులు ఇవ్వాలి. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చేయాలి. ఇది రెండు నుంచి నాలుగు వారాల్లో భారత్‌లో సాధారణ కార్యకలాపాలు నెలకొనేలా ఉపకరిస్తుంది.
మహమ్మారికి చైనానే బాధ్యత వహించాలా?
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాపై వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రపంచ సమాజం అంతా చైనానే బాధ్యురాలిగా చేయాలని కోరుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అనుసరించాల్సిన విధానంపై ఏమిటి?
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సానుకూలంగా వ్యవహరించాలి. విధాన నిర్ణయంలో భారత్ పారదర్శకత పాటిస్తుంది. మార్కెట్‌ను అందుబాటులో ఉంచడమే కాదు. విధానాల్లో విశ్వసనీయత ఉండాలి. వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసినప్పుడు ఏం జరిగింది. రెండు వారాల అనంతరం వారి విధానాలను మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన అనంతరం అన్ని ఒప్పందాలను రద్దు చేశారు. ఒప్పందానికి విశ్వసనీయత ప్రభుత్వం ఉన్నంతవరకే ఉంటుంది. ఇది మారాలి.
వ్యాపార వ్యవస్థ మనుగడకు తీసుకోవాల్సిన చర్యలు?
వ్యాపారులపై వినియోగదారులు విశ్వాసం కోల్పోయారు. లాక్డౌన్ కారణంగా వ్యాపారులు సరుకులను తరలించలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు చాలా కృషి చేస్తున్నారు. అయితే 2021లో కూడా పరిస్థితులు చక్కదిద్దుకోకపోవచ్చు. ఆర్థిక రంగంపై పడిన కరోనా ప్రభావం 2022 అనంతరమూ కొనసాగొచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి ప్రవేశిస్తేనే ఉద్యోగాల కల్పన నిలకడగా కొనసాగుతుంది. ఏడాదికి 100 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు పదేళ్ల పాటు భారత్‌లోకి వస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకు పరుగులు పెడుతుంది.
అమెరికాలో భవిష్యత్తులో హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?
హెచ్1బీ సమస్య చాలా సంక్లిష్టమైనది. ఈ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజులలోపే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. లేదా దేశం విడిచివెళ్లాలి. ప్రస్తుతం భారత్ నుంచి రెండున్నర లక్షలమంది హెచ్1బీ వీసాదారులు అమెరికాలో ఉన్నారు. వారు ఉద్యోగాలు వెతుక్కోవడం సమస్యగా మారింది. మరో ఎనిమిది లక్షలమంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. ఈ అరవై రోజుల నిబంధన వీరికి వర్తిస్తుంది. ఉద్యోగాల సమస్య ఆయా వర్గాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌కు నిధుల ప్రవాహం తగ్గొచ్చు.
చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. భారత్‌పై దీని ప్రభావం ఎంత?
చమురు ధరలు తగ్గడం భారత్‌కు వరం లాంటిది. బ్యారెల్‌పై తగ్గే ప్రతి డాలరు ధర భారత విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావం చూపుతుంది. భారత్ అతిపెద్ద చమురు దిగుమతి దారు అయిన నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేదిగా ఉండనుంది.
ఇదీ చూడండి: 'చైనా నుంచి భారత్‌కు ఓడల్లో 63,000 మంది...'