ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. బీజాపుర్ జిల్లా పమేద్ పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలోని తోగ్గూడెం పోలీసు శిబిరం సమీపంలో కాల్పులు జరిపారు. తిప్పాపురం నుంచి క్యాంపునకు బైక్పై వస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను పొట్టన బెట్టుకున్నారు మావోయిస్టులు.
ఈ ఘటనలో ఓ స్థానికుడి చాతిలోకీ బుల్లెట్ దూసుకెళ్లింది. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.