ETV Bharat / bharat

ఈ నెల 18న భారత్- అమెరికా మధ్య 2+2 చర్చలు

author img

By

Published : Dec 13, 2019, 5:46 AM IST

Updated : Dec 13, 2019, 10:13 AM IST

భారత్​ అమెరికా మధ్య రెండో 2+2 మంత్రుల ద్వైపాక్షిక చర్చలు డిసెంబర్ 18న జరగనున్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్​ తెలిపారు. ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు వాషింగ్టన్​​లో భేటీ కానున్నట్లు తెలిపారు.

Two-plus-two Indo-US dialogue to be held on Dec 18 in Washington: MEA
డిసెంబర్ 18న భారత్- అమెరికా మధ్య రెండో 2+2 చర్చలు
ఈ నెల 18న భారత్- అమెరికా మధ్య 2+2 చర్చలు

భారత్-అమెరికా మధ్య రెండో 2+2 ద్వైపాక్షిక చర్చలు డిసెంబర్ 18న వాషింగ్టన్​​లో జరగనున్నాయి. చర్చల్లో భాగంగా విదేశాంగ విధానంపై సమగ్ర సమీక్ష సహా భద్రతా, రక్షణ సంబంధాలపై ఇరుదేశాల నేతలు సమాలోచనలు జరపనున్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించనున్నారు.

భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి జయ్​శంకర్, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పాల్గొననున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. అమెరికా ప్రతినిధులతో వీరిరువురు సమావేశం కానున్నట్లు తెలిపారు. అమెరికా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ చర్చల్లో పాల్గొననున్నారు.

"ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ అమెరికా 2+2 మంత్రుల సమావేశం 2018 సెప్టెంబర్​లో ప్రారంభించాం. అప్పటినుంచి భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. త్వరలో జరగనున్న సమావేశంలో ఇరుదేశాల మంత్రులు.. భద్రత, రక్షణ రంగాలు సహా విదేశాంగ విధానాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు."-రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతనిధి

ఇదీ చూడండి: హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం

New Delhi, Dec 12 (ANI): Parts of national capital received showers on December 12 evening. Rain has also raised hopes for better air quality. The rains are also expected to add to the winter chill. The Western Disturbance over Iran and Afghanistan caused isolated incidences of rain and snow over Northern India. Earlier today, the overall Air Quality Index (AQI) remained in the 'severe' category.
Last Updated : Dec 13, 2019, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.