ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మరో ఇద్దరు మంత్రులకు కరోనా - Adesh Gupta for covid-19 positive news

దేశంలో ఇప్పటికే పలువురు నాయకులకు కరోనా సోకింది. తాజాగా కర్ణాటకలో మరో ఇద్దరు కేబినెట్​ మంత్రులు కొవిడ్​ బారినపడ్డారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ట్విట్టర్​లో వెల్లడించారు. దిల్లీ భాజపా అధ్యక్షుడికి కూడా కరోనా పాజిటివ్​గా తేలింది.

Two more Karnataka ministers test positive for COVID-19
కర్ణాటకలో ఇద్దరు మంత్రులకు కరోనా
author img

By

Published : Sep 16, 2020, 1:15 PM IST

కర్ణాటకలో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. రాష్ట్ర హోంమంత్రి బసవరాజ బొమ్మైకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్​లో వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన... తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే గోపాలయ్య కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దిల్లీ భాజపా చీఫ్​కు..

దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్​ గుప్తాకు కరోనా పాజిటివ్​గా తేలింది. అయితే ఆయన గతవారం నుంచే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మోదీ మెచ్చిన కొయ్య బొమ్మలు- మహిళలే రూపకర్తలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.