ఉగ్రవాదంవైపు ఆకర్షితులై ముఠాలో చేరిన జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరు యువకులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు, సైనిక అధికారుల ఎదుట లొంగిపోయారు.


ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బారాముల్లా జిల్లాలో భారత దళాలు నిర్భంద తనీఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో సోపోర్ పట్టణానికి చెందిన 20, 21 ఏళ్ల ఇద్దరు యువకులు అధికారులకు తారసపడ్డారు. కొత్తగా ముఠాలో చేరిన వీరు.. పోలీసులు, అర్మీ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయి ఉగ్ర ముఠాలో చేరిన జహంగిర్ భట్ అనే వ్యక్తి కూడా ఇటీవలే ఆర్మీ అధికారులకు లొంగిపోయాడు.
ఇదీ చదవండి: నేపాలీయుల కోసం.. భారత్‌లో ఆ బ్రిడ్జ్ పునఃప్రారంభం