చదునైన ఆకారంతో, చూడటానికి భారీగా నల్లటి ఆల్చిప్పలా కనిపించే రెండు అరుదైన చేపలు కర్ణాటక, ఉడుపి జిల్లాలోని మాల్పే నగరానికి చెందిన మత్య్సకారుల వలకు చిక్కాయి. సుమారు 750, 250 కిలోల బరువున్న రెండు చేపలను స్టిన్ గ్రే (శాస్త్రీయ నామం) చేపలుగా గుర్తించారు. స్థానికంగా వీటిని 'థోరేక్ మీను' అని పిలుస్తారు.
మాల్పేకు చెందిన సుభాష్ అనే జాలరు తన బోట్లో హార్బర్ సమీపంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన క్రమంలో.. ఆ చేపలు చిక్కాయి. ఈ క్రమంలో భారీ క్రేన్లతో బయటకు లాగినట్లు చెప్పారు మత్య్సకారులు. ఈ చేపలు రుచికరంగా ఉంటాయని, ఎక్కువ శాతం విదేశాలకు ఎగుమతి అవుతాయని తెలిపారు.
ఇలాంటి చేపలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ భారీ చేపలను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చూడండి: లారీ కింద పడి ప్రాణాలతో బయటపడిన బాలుడు