ETV Bharat / bharat

యూపీలో ఇద్దరు బాలికల 'ప్రేమ వివాహం'

ఉత్తర్​ప్రదేశ్​లో విచిత్ర ఘటన జరిగింది. ఏడాది కాలంగా ఇద్దరు బాలికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పురుష జీవితంతో సంబంధం లేకుండా వారిద్దరే కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే.. దీనికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. ఇంతలో వారు పరారై, పెళ్లి చేసుకున్నారు.

Two girls elope, marry each other in Kanpur
ఆ రాష్ట్రంలో ఇద్దరు బాలికలు పరస్పర వివాహం
author img

By

Published : Sep 29, 2020, 2:09 PM IST

Updated : Sep 29, 2020, 7:51 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో ఇద్దరు బాలికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి సంబంధంపై రెండు కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ద్వేషం నుంచి పుట్టిన ప్రేమ!

రతి తివారీ, నందిని గౌతమ్​ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం పరిచయం అయింది. ఇద్దరికీ పురుషులంటే ద్వేషం కాబట్టి.. రెండు మనసులూ ఏకమయ్యాయి. అయితే.. ఈ విషయంపై ఇద్దరు అమ్మాయిల కుటుంబ సభ్యులు, సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆ ఇద్దరు బాలికలు పారిపోయి.. కాన్పుర్​లోని బర్రా ప్రాంతంలో వివాహం చేసుకున్నారు.

ఈ విషయమై నందిని తల్లి గుడియా దేవి.. తన కుమార్తెను రతి, ఆమె సోదరుడు కిడ్నాప్​ చేశారని ఆరోపిస్తూ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఘటనపై కూతురు నందిని స్పందించింది. రతిని తాను ఇష్టపూర్వకంగానే వివాహమాడానని.. తన తల్లి తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పింది.

ఇదీ చదవండి: యూపీ అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి

Last Updated : Sep 29, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.