తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో సీబీ- సీఐడీ అధికారులు పురోగతి సాధించారు. బుధవారం ఓ సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్టు చేయగా.. ఇవాళ మరో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు.
సస్పెండ్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ రాగు గణేశ్‌ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న తూత్తుకుడి సాతంకుళం ప్రాంత ప్రజలు ఆనందంతో టపాసులను కాల్చారు.
ఏమిటీ ఈ కేసు?
లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్‌ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్‌ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీబీఐ ఛార్జి తీసుకునే వరకు సీబీ- సీఐడీతో విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి:విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న కేంద్రం!