తమిళనాడు కోయంబత్తూరు పెరియానైకెన్పాలయంలో ఓ ఏనుగు మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఏనుగు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చనిపోయిన ఏనుగుకు సుమారు 13 ఏళ్లు ఉండొచ్చని, ఇది 20 రోజుల క్రితమే మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. జంతు సంరక్షణ కార్యకర్త సమక్షంలో తమ శాఖకు చెందిన వైద్యుడు ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారని అటవీశాఖ అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఏనుగు మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
కోయంబత్తూరులో గత మూడు నెలల్లో ఎనిమిది ఏనుగులు చనిపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: గజరాజుకు గండం- తగ్గిపోతున్న సంఖ్య