రాజీనామా సమర్పణ...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు కమల్‌నాథ్. గత రెండు వారాలుగా మధ్యప్రదేశ్‌లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువల్ని బలహీనపరిచాయని లేఖలో కమల్‌నాథ్ పేర్కొన్నారు.
13:31 March 20

12:51 March 20
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు.
"15 నెలల పాటు రాష్ట్రాభివృద్దికోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రైతులు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించాం. కానీ, మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రజల నమ్మకాన్ని భాజపా వమ్ము చేసింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం భాజపాకు నచ్చలేదు" - కమల్‌నాథ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల కమల్‌నాథ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
సంక్షోభం...
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం వల్ల ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో మొదట ఆరుగురి రాజీనామాల్ని స్పీకర్ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించారు. అయితే బలపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ భాజపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5 గంటల వరకు డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. ఈరోజు ఒక భాజపా ఎమ్మెల్యే రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు.
లెక్కల వివరాలు...
230 శాసనసభ స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 228 ఎమ్మెల్యేలుండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది కాంగ్రెస్, ఒక భాజపా ఎమ్మెల్యే రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందడం వల్ల శాసనసభ్యుల సంఖ్య 205కు చేరింది. ప్రస్తుతం బలపరీక్షలో ఏ పార్టీ నెగ్గాలన్నా 103 మంది ఎమ్మెల్యేలు అవసరం. భాజపాకు 106 మంది సంఖ్యా బలం ఉంది. గతంలో 114 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో 92కు చేరింది. మరో ఏడు మంది ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు.
12:30 March 20
12:26 March 20
12:24 March 20
12:20 March 20
12:15 March 20
కమల్‌నాథ్ రాజీనాామా!
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను ఎంతగానో శ్రమించానని చెప్పారు. తమ సర్కార్‌ను దించేయాలని భాజపా కుట్రలు చేసిందని కమల్‌నాథ్ ఆరోపించారు.
11:56 March 20
కాసేపట్లో సీఎం మీడియా సమావేశం...
కాసేపట్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ఈరోజు బలపరీక్ష ఉన్నందున కమల్‌నాథ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
11:49 March 20
భాజపా ఎమ్మెల్యే రాజీనామా ఆమోదం...
మధ్యప్రదేశ్ స్పీకర్ ప్రజాపతి తాజాాగా ఓ భాజపా శాసనసభ్యుడి రాజీనామాను ఆమోదించారు. 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలకు ఇటీవల ఆమోదముద్ర వేశారు స్పీకర్.
11:37 March 20
మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష- కమల్‌నాథ్ సర్కార్ గట్టెక్కేనా!
బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వేళ 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఎంపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఆమోదించారు. ఫలితంగా కాంగ్రెస్ బలం 114 నుంచి 92కు పడిపోయింది. 230 మంది సభ్యులున్న ఎంపీ శాసనసభలో 2 ఖాళీలు ఉండగా సభ్యుల సంఖ్య 206కు పడిపోయింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 104 కాగా భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ ఎంపీ పీఠం ఎక్కే అవకాశం ఉంది.
ముందే చేయాల్సింది..
రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం ముందే తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు చౌహాన్. సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే ఇప్పటివరకు దీనిని తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి వచ్చేదని అన్నారు.
సుప్రీం తీర్పు..
మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. శాసనసభలో శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని ఆదేశించింది. బలపరీక్ష కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలను చేతులు పైకెత్తమని ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ సమావేశాలను వీడియోలో చిత్రీకరించాలని, వీలైతే ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
చట్ట ఉల్లంఘనలు జరగకుండా చూసే బాధ్యత అసెంబ్లీ కార్యదర్శికి అప్పజెప్పింది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 16 మంది విశ్వాస పరీక్షకు హాజరుకావాలని అనుకుంటే వారికి పూర్తి భద్రత కల్పించాలని మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలకు సుప్రీం సూచించింది.
అంతకుముందు రెబల్ ఎమ్మెల్యేలతో వీడియో లింక్ ద్వారా మాట్లాడాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతికి సూచించగా.. ఆయన నిరాకరించారు. సుప్రీం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
విప్ జారీ..
బలపరీక్ష నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు భాజపా, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ సభకు హాజరు కావాలని స్పష్టం చేశాయి.