ETV Bharat / bharat

'ట్రంప్​ అందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు' - అమెరికా భారత్ తాజా వార్తలు

వాణిజ్య పరంగా భారత్​ తమతో సరిగా వ్యవహరించలేదని డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలపై భారత్​ స్పందించింది. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు విషయమై ట్రంప్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్ పేర్కొన్నారు.

trump
'ట్రంప్​ అందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు'
author img

By

Published : Feb 20, 2020, 7:00 PM IST

Updated : Mar 1, 2020, 11:48 PM IST

'ట్రంప్​ అందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు భారత్ తెలిపింది. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

వాణిజ్యం ఒప్పందంపై ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. జటిలమైన అంశాలపై ఒప్పందం చేసుకోవాలనే ఉద్దేశం లేదని, దేనికైనా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు విషయమై భారత్‌ తమను బాగా చూడలేదని ట్రంప్‌ పేర్కొన్నట్లు రవీశ్​ కుమార్ వివరణ ఇచ్చారు.

"వస్తువులు, సేవలతో కలిపి భారత్‌కు అమెరికా అతిపెద్ద శిక్షణ భాగస్వామి. కొన్ని సంవత్సరాలుగా ఇరుదేశాల వాణిజ్యంలో సుస్థిరమైన వృద్ధి నమోదవుతోంది. వాణిజ్య లోటును దృష్టిలో ఉంచుకుని భారత్‌ తమను బాగా చూడటం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించి ఉంటారు.

వాణిజ్య లోటును పూడ్చేందుకు భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలు మీ అందరికి తెలిసిందే. ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా ఆరో పెద్ద దేశం. పౌర విమానాలు మేము ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నాం. ఈ విధంగా వాణిజ్య లోటును పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం."

-రవీశ్‌కుమార్‌, విదేశాంగ అధికార ప్రతినిధి

షెడ్యూల్​...

మొదటిసారి భారత పర్యటనకు వస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24న మధ్యాహ్నం అహ్మదాబాద్‌కు చేరుకుంటారని రవీశ్‌కుమార్‌ తెలిపారు.

విమానాశ్రయం నుంచి నేరుగా 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో పాల్గొనేందుకు మోటేరా స్టేడియానికి చేరుకుంటారన్నారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, కళాకారులు ట్రంప్‌, మోదీకి స్వాగతం పలుకుతారని రవీశ్‌ కుమార్‌ వివరించారు.

Last Updated : Mar 1, 2020, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.