భారత్కు అత్యంత అధునాతన గగనతల రక్షణవ్యవస్థను అమెరికా సరఫరా చేయనుంది. ఈ మేరకు 186 కోట్ల డాలర్ల విలువైన సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్) విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదం తెలిపింది.
ఆకాశమార్గంలో జరిగే శత్రుదాడిని తిప్పికొట్టడానికి, సైనిక దళాల ఆధునీకీకరణలో భారత్కు ఇది ఉపయోగపడుతుందని డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. అమెరికా కాంగ్రెస్కు తెలిపింది. ఐఏడీడబ్ల్యూఎస్ను విక్రయించాలని భారత్ కోరినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఏఎన్/ఎంపీక్యూ-64ఎఫ్ఐ సెంటినెల్ రాడార్ వ్యవస్థ, 118 ఆమ్రామ్ ఏఐఎం-120సి-7/సి-8 క్షిపణులు, మూడు ఆమ్రామ్ మార్గనిర్దేశ వ్యవస్థలు, 134 స్టింగర్ క్షిపణులు, ఇతర అధునాతన సెన్సర్లు, సాధనాలు, లాంచర్లు మన దేశానికి అందుతాయి.
వ్యూహాత్మకంగా..
భారత్కు క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలోపేతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేసింది అగ్రరాజ్యం.
ఇదీ చూడండి: కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు