ETV Bharat / bharat

'సార్వత్రికం' ఆరో దశకు రంగం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌కు  రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.

'సార్వత్రికం' ఆరో దశకు రంగం సిద్ధం
author img

By

Published : May 11, 2019, 6:02 PM IST

సార్వత్రిక ఆరో దశ పోలింగ్​కు సిద్ధం

సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్​ ముగిసింది. ఆదివారం ఆరో విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శాంతియుత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

ఆరో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 59 లోక్​సభ స్థానాలకు ఆదివారం పోలింగ్​ జరగనుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు లక్షా 13 వేల పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లో 14, బిహార్​లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్​లో 4, మధ్యప్రదేశ్​లో 8, బంగాల్​లో 8, దిల్లీలో 7 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

poll
సార్వత్రికం ఆరో దశ ఎన్నికలు

ఉత్తరప్రదేశ్​లో హోరాహోరీ...

ఉత్తరప్రదేశ్​లోని 14 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ప్రధానంగా భాజపా- ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ కూటమి మధ్య పోరు నెలకొంది.

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ అజంగఢ్‌ నుంచి బరిలో ఉన్నారు. 2014లో ఇక్కడి నుంచి అఖిలేశ్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ విజయం సాధించారు.

కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న 14 నియోజకవర్గాల్లో 2014లో భాజపా 13 చోట్ల నెగ్గింది.

మధ్యప్రదేశ్​లో నువ్వా-నేనా..

మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్​ జరగనుంది. కాంగ్రెస్​, భాజపా మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది.

రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, ఇటీవల భాజపాలో చేరిన మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.

కాంగ్రెస్‌ కంచుకోట గుణ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. మోరేనా లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ థోమర్‌ బరిలో ఉన్నారు.

దిల్లీ పోరు త్రిముఖం...

దేశ రాజధాని దిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ భాజపా, ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది. కమల దళాన్ని ఓడించేందుకు ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకునేందుకు యత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌, బాక్సింగ్‌లో ఒలింపిక్‌ పతక విజేత విజేందర్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ వంటి ప్రముఖులు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బంగాల్​లో పటిష్ఠ భద్రత...

బంగాల్‌లో 5 జిల్లాల పరిధిలోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా, కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య ఇక్కడ పోటీ నెలకొంది.

పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 770 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఘటాల్‌ లోక్‌సభ స్థానంలో తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ నటుడు 'దీపక్‌ అధికారి'పై భాజపా తరఫున మాజీ ఐపీఎస్​ అధికారిణి భారతీ ఘోష్‌ బరిలో ఉన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మేధినిపుర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

హరియాణాలో...

హరియాణాలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌, భాజపా మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ. కేంద్ర మంత్రులు క్రిషణ్‌ పాల్‌ గుర్జార్‌, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా బరిలో ఉన్నారు.

బిహార్​లో గెలుపెవరిది?

బిహార్‌లోని 8 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. 2014లో ఈ 8 స్థానాల్లోనూ ఎన్​డీఏ పక్షాలే గెలుపొందాయి. ఈసారి ఆర్​జేడీ నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. పూర్వి చంపారన్‌ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు.

ఝార్ఖండ్​ పోటీ...

ఝార్ఖండ్‌లోని 4 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఝార్ఖండ్‌ మంత్రి చంద్ర ప్రకాశ్‌చౌదరి, మాజీ క్రికెటర్‌ కీర్తి అజాద్‌, మాజీ ముఖ్యమంత్రి మధుకోడా భార్య గీత ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. కీర్తి అజాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ధన్‌బాగ్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

హెలికాప్టర్​ మెకానిక్​గా రాహుల్ గాంధీ!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PHOENIX TV - AP CLIENTS ONLY
Washington DC - 10 May 2019
1. Chinese Vice Premier Liu He sitting and talking to media
2. SOUNDBITE (Mandarin) Liu He, Chinese Vice Premier:
"I don't think the negotiation has broken down. On the contrary, I think it is just a small setback in the talks between the two countries, which is inevitable. We are still cautiously optimistic for the future."
3. Cutaway of reporter
4. SOUNDBITE (Mandarin) Liu He, Chinese Vice Premier: ++PARTIALLY OVERLAID WITH WIDE PAN OF GROUP INTERVIEW++
"First, the issue of whether the tariffs should be lifted is still under discussion. It is China's opinion that the tariffs are the starting point of the trade frictions and must be totally lifted if a deal is to be reached."
5. Cutaway of reporter
6. SOUNDBITE (Mandarin) Liu He, Chinese Vice Premier: ++PARTIALLY OVERLAID WITH MID OF REPORTER++
"The second issue is about purchasing. The leaders of the two countries reached a consensus on the tentative amount of the purchasing during their meeting in Argentina, but now the two sides have different opinions on exactly what the amount should be. We think this is a very serious issue and we cannot easily change our mind."
7. Cutaway of reporter
8. SOUNDBITE (Mandarin) Liu He, Chinese Vice Premier:
"The US side said we had promised something in the documents and we wanted to change it. We believe that before the two sides reach a deal, any change is normal. It is something that happens in the process. So I don't think China stepped back and we don't agree with the word renege. We didn't step back, we just had differences on the wording in certain documents and we hoped to solve the differences. Therefore we think it unnecessary to have an over reaction to it."
++ ENDS ON SOUNDBITE++
STORYLINE:
Chinese Vice Premier Liu He said Beijing was "still cautiously optimistic" about the future outcome of trade talks with the United States.
The chief trade negotiator for China spoke to media on Friday after his meeting with US officials.
He said trade talks between the world's two largest economies had not broken down, despite the Trump administration announcing an increase of tariffs on 200 billion US dollars worth of Chinese goods from 10% to 25%.
Liu said the tariff increase from the US side was merely a "small setback."
He further told reporters that differences between the two sides were focused on whether the new tariffs should be lifted once the deal is made, the amount of China's purchase of the US products and the wording of certain documents.
He said these were matters of principle that China would not make concessions on.
Liu also refuted the US accusation of China reneging from the original promises in the negotiation, saying that it was normal to make changes before a deal is reached.
"We think it unnecessary to have an over reaction to it," Liu said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.