ETV Bharat / bharat

ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్ - trains stopped upto 12 August

railway
ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్..
author img

By

Published : Jun 25, 2020, 9:34 PM IST

Updated : Jun 25, 2020, 10:37 PM IST

22:34 June 25

ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్‌ ఆధారిత అన్ని రెగ్యులర్‌ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.  

కరోనా కట్టడికి మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ నిర్ణయంతో అన్ని రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని అప్పట్లో తెలిపింది. ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్‌ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్‌డౌన్‌ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వసల కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి. 

21:27 June 25

ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్

ఆగస్టు 12వరకు రైల్ సర్వీస్​లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వేబోర్డ్​. మెయిల్​, ఎక్స్​ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులను నిలిపేస్తున్నట్లు చెప్పింది. జులై 1 నుంచి ముందస్తుగా రిజర్వేషన్​ చేసుకున్న అన్ని బుకింగ్​లను రద్దు చేసినట్లు చెప్పింది. 

సబర్బన్, ఎక్స్​ప్రెస్, మెయిల్ రైళ్లు అన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైళ్లు రద్దు చేస్తున్నట్లు జోనల్ రైల్వే జీఎంలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్లు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.  

సాధారణ రైళ్ల కోసం బుక్ చేసుకున్న టికెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ.. మే నెల 11న జారీ చేసిన ఉత్తర్వులు వర్తింపజేయాలని పేర్కొంది. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు, అత్యవసర సేవల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

Last Updated : Jun 25, 2020, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.