దేశంలో కరోనా తన పరిధిని పెంచుకుంటోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 40,425 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 681 మంది కరోనా బారినపడి మరణించారు. జులై 19 వరకు దేశవ్యాప్తంగా 1,40,47,908 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఒక్కరోజే 2,56,039 టెస్టులు చేశారు.
- మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,10,455కు చేరింది. 11,585 మంది వైరస్‌కు బలయ్యారు.
- తమిళనాడులో కేసులు 1,70,693కి చేరాయి. 2,481 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొవిడ్ బాధితుల సంఖ్య 1,22,793గా ఉంది. మొత్తంగా 3,628 మంది మృతి చెందారు.
- గుజరాత్లో మొత్తంగా 48,441 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. 2,156 మంది కరోనా కారణంగా చనిపోయారు.
ఇదీ చూడండి:బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 16 మంది మృతి