ETV Bharat / bharat

స్టంట్​ చేయబోయి.. పోలీస్​ పోస్ట్​నే ఢీ కొట్టాడు - TELUGU NATIONAL NEWS

కర్ణాటకలోని ప్రముఖ ఫన్​ వరల్డ్​ యజమాని వినయ్​ కుమార్​ సభర్వాల్​ తనయుడు కారుతో పోలీస్​ పోస్ట్​ను ఢీ కొట్టాడు. స్టంట్​ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో అదుపుతప్పడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది.

Top class Sunny crashed the Police chowki By his Lamborgini
స్టంట్​ చేయబోయి.. పోలీస్​ చౌకీనే ఢీ కొట్టాడు
author img

By

Published : Feb 12, 2020, 1:49 PM IST

Updated : Mar 1, 2020, 2:13 AM IST

స్టంట్​ చేయబోయి.. పోలీస్​ పోస్ట్​నే ఢీ కొట్టాడు

ప్రముఖ ఫన్​ వరల్డ్​ యజమాని వినయ్​ కుమార్​ సభర్వాల్​ తనయుడు సన్నీ సభర్వాల్.. కర్ణాటకలో​ కొత్త లంబోర్ఘిని కారుతో నేరుగా వెళ్లి పోలీసు పోస్ట్​నే ఢీకొట్టాడు.

కారుతో స్టంట్​ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం సన్నీ కారుతో పాటు ఫొటోలు దిగి.. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

సీసీటీవీ దృశ్యాల సాయంతో..

ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తిని ఢీకొట్టినందుకు ఎమ్మెల్యే హ్యారిస్​​ తనయుడికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మేరకు.. సీసీటీవీ దృశ్యాల సాయంతో నగరంలోని అన్ని రాయల్​ కార్ల గురించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Mar 1, 2020, 2:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.