ETV Bharat / bharat

విద్రోహ పాక్​ డ్రోన్లపై భారత్​ వజ్రాయుధం..! - ఇజ్రాయిల్ డ్రోన్లు

డ్రోన్​లను వినియోగించి పాకిస్థాన్​... భారత్​లోకి అక్రమంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు పంపిస్తున్న వేళ... వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి భారత్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం స్వదేశీ, విదేశీ సాంకేతిక డ్రోన్​లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

విద్రోహ డ్రోన్లపై భారత్​ వజ్రాయుధం..!
author img

By

Published : Oct 16, 2019, 5:31 AM IST

ఆర్మీ కమాండర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సైన్యాధికారులు. స్వదేశీ, విదేశీ తయారీ రక్షణ ఉత్పత్తులు, డ్రోన్​లను పరిశీలించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో సైన్యాధిపతి జనరల్ బిపిన్​ రావత్​ కూడా పాల్గొన్నారు.

పంజాబ్​లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి పాకిస్థాన్​ డ్రోన్​లను వినియోగిస్తోంది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని సైన్యం నిర్ణయించింది. ఇందుకోసం దేశ, విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పలు కౌంటర్​ డ్రోన్​లను బిపిన్​ రావత్, కమాండర్స్​ పరిశీలించారు.

ఇజ్రాయెల్​ డ్రోన్​లు

అత్యంత ఎత్తైన ప్రదేశాలకు చేరుకోగలిగే సామర్థ్యం గల, శత్రు లక్ష్యాలను శోధించి, గుర్తించి, నాశనం చేయగల ఇజ్రాయెల్ తయారీ డ్రోన్​లనూ అధికారులు పరిశీలించారు.

పాక్​ దుస్సాహసం

గతవారం పంజాబ్​లోని ఫిరోజ్​పుర్​లోకి ఓ పాకిస్థానీ డ్రోన్ ప్రవేశించింది. ఈ పరిణామంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​), పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్​ 8, 9 తేదీల్లో పాక్ డ్రోన్లు హజారాసింగ్ వాలా, టెండివాలా గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఈ విషయంపై మంగళవారం పాకిస్థాన్​ రేంజర్స్​తో జరిగిన ఫ్లాగ్​ మీటింగ్​లో బీఎస్​ఎఫ్ నిరసన వ్యక్తం చేసింది.

కొద్ది రోజుల క్రితం 2 పాక్ డ్రోన్​లను పంజాబ్​ పోలీసులు పట్టుకున్నారు. ఇవి జీపీఎస్​తో పనిచేస్తూ భూమికి 500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వచ్చాయి. వీటి ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, హ్యాండ్ గ్రనేడ్​లు, శాటిలైట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: నోట్లరద్దు, జీఎస్టీ కారణంగానే నిరుద్యోగం: రాహుల్

New Delhi, Oct 15 (ANI): Army Chief General Bipin Rawat attended 41st DRDO Directors Conference on October 15 in New Delhi. Speaking at the event, he said, "DRDO has made strides in ensuring that requirements of the services are met through home-grown solutions. We are confident that we will fight and win the next war through indigenised weapons systems and equipment." As the country is looking for innovative methods of defence, General Bipin Rawat added, "We are looking at systems for future warfare. We have to start looking at development of cyber, space, laser, electronic and robotic technologies and artificial intelligence."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.