దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న కమాండర్ల సమావేశంలో సరిహద్దు పరిస్థితులు, వ్యయాలను తగ్గించేందుకు వస్తున్న ప్రతిపాదనపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.
సైనిక వేడుకలకు అయ్యే ఖర్చును తగ్గించాలని, కొన్ని అనవసర కార్యక్రమాలను వాయిదా వేయాలని పలు ప్రతిపాదనలు వచ్చినట్టు అధికారులు చెప్పారు. కలర్ ప్రెజెంటేషన్, రెజిమెంటల్ రీయూనియన్స్ వంటి వేడుకలను నిర్వహించడానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఈ వారంలోనే భారత్-చైనా 8వ దఫా సైనిక చర్చలు!