లోక్సభ సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశమై నేడు అఖిల పక్ష భేటీ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖలు రాశారు.
సమావేశంలో కీలక అంశాలు
- పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
- ఒకే దేశం- ఒకే ఎన్నిక
- 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు
- మహాత్మాగాంధీ 150వ జయంతి నిర్వహణ
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధి
ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని కేంద్రం తన లేఖలో పేర్కొంది.
ఇదీ చూడండి: ప్రధానితో భేటీకి వచ్చేదిలేదు: మమతా బెనర్జీ