తమిళనాడులో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 110 కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాలకు చెందిన వీరంతా దిల్లీలోని తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 234 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదే తొలిసారి
దేశవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది తమిళనాడు. రాష్ట్రం నుంచి గత నెలలో సుమారు 15 వందల మంది దిల్లీలోని తబ్లీగీ కార్యక్రమానికి హాజరయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,131 మంది తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారని పేర్కొన్నారు.