ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 'ఆమ్ ​ఆద్మీ'కి బంగాల్​ దీదీ మద్దతు

author img

By

Published : Jan 30, 2020, 11:16 AM IST

Updated : Feb 28, 2020, 12:18 PM IST

దిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్​ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించింది తృణమూల్​ కాంగ్రెస్​. ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ సహా పార్టీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని కోరుతూ ట్విట్టర్​ వేదికగా ఓ వీడియో సందేశాన్ని అందించింది.

TMC endorses AAP in Delhi polls
ఆమ్ ​ఆద్మీ'కి బంగాల్​ దీదీ మద్దతు

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్.. దిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్​ ఆద్మీ పార్టీకి మద్దతు పలికింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్​, ఆప్​ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ విన్నవించింది.

కేజ్రీవాల్​ పార్టీకి మద్దతుగా టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్​ ఓబ్రెయిన్..​ ట్విట్టర్​లో ఓ వీడియో షేర్​ చేశారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి, రాజేంద్ర నగర్​ నియోజకవర్గ అభ్యర్థి రాఘవ్​, సీఎం కేజ్రీవాల్​ సహా ఆప్​ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని కోరారు.

Vote for @AamAadmiParty

Vote for the candidate from Rajendra Nagar constituency @raghav_chadha

Vote for @ArvindKejriwal and all AAP candidates in Delhi

WATCH pic.twitter.com/KcgHbPpkB7

— Citizen Derek | নাগরিক ডেরেক (@derekobrienmp) January 30, 2020 ">

భాజపాతో దాదాపు ప్రతి విషయంలోనూ విభేదిస్తున్నారు టీఎంసీ అధినేత్రి మమత. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా స్వయంగా తానే ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు దిల్లీ ఎన్నికల్లో భాజపాకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆప్​కు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: ఏడు పదుల వయసులోనూ హేమ మాలిని నాట్యం భళా

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్.. దిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్​ ఆద్మీ పార్టీకి మద్దతు పలికింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్​, ఆప్​ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ విన్నవించింది.

కేజ్రీవాల్​ పార్టీకి మద్దతుగా టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్​ ఓబ్రెయిన్..​ ట్విట్టర్​లో ఓ వీడియో షేర్​ చేశారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి, రాజేంద్ర నగర్​ నియోజకవర్గ అభ్యర్థి రాఘవ్​, సీఎం కేజ్రీవాల్​ సహా ఆప్​ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని కోరారు.

భాజపాతో దాదాపు ప్రతి విషయంలోనూ విభేదిస్తున్నారు టీఎంసీ అధినేత్రి మమత. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా స్వయంగా తానే ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు దిల్లీ ఎన్నికల్లో భాజపాకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆప్​కు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: ఏడు పదుల వయసులోనూ హేమ మాలిని నాట్యం భళా

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.