ETV Bharat / bharat

ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా: దీదీ - తృణమూల్​కాంగ్రెస్​ పార్టీ 23వ దినోత్సవం

తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భవించి నేటికి 23 సంవత్సరాలు. ఈ సందర్భంగా వేడుకల్ని బంగాల్​లో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి టీఎంసీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమత మాట్లాడారు.

TMC celebrates foundation day, Mamata vows to continue her fight for people
ప్రజలకోసం అలుపెరగని పోరాటం: టీఎంసీ 23 ఆవిర్భావ వేడుకలో దీదీ
author img

By

Published : Jan 1, 2021, 6:55 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు బంగాల్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీఎంసీ సీనియర్​ నాయకులు.. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులను ప్రశంసించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు దీదీ.

"ఇవాళ్టికి తృణమూల్​ ఆవిర్భవించి 23 ఏళ్లు. 1998 ఇదే రోజున(జనవరి1) పార్టీని స్థాపించి నా ప్రయాణాన్ని ప్రారంభించా. ఈ 23 సంవత్సరాల్లో ఎన్నో కష్టాల్ని మనం ఎదుర్కొన్నాం. అయితే వాటన్నింటినీ అధిగమిస్తూ ఇందాకా వచ్చాం. బంగాల్​ రాష్ట్రాన్ని ఇంకా మెరుగుపరచడానికి మనందరం తీవ్రంగా కృషి చేయాలి. మన అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే. దానికోసం మనం ఎక్కడివరకైనా వెళ్లాలి."

- మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి, బంగాల్​ సీఎం

తొలిసారిగా 2011లో దీదీ నేతృత్వంలోని తృణమూల్​ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు 9 ఏళ్లకుపైగా మమత.. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​- మే లో బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈసారి అధికార పార్టీకి భాజపా గట్టిపోటీని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: రాజకీయాల కోసం చదువుకు దూరమవ్వలేను: ఆర్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.