ETV Bharat / bharat

కామ్రేడ్స్​... మాకు సాయం చేయండి: టీఎంసీ - మనీ లాండరింగ్ కేసులో కేడీ సింగ్ అరెస్టు

కాంగ్రెస్​, వామపక్షాల కూటమి తృణమూల్​ కాంగ్రెస్​కే మద్దతుగా నిలవాలని ఆ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. భాజపాకు అధికార పీఠం దక్కకుండా తృణమూల్​ వ్యూహరచన చేస్తోన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

TMC appeals left and congress to support them
వామపక్ష కూటమి సాయం కోరుతోన్న తృణమూల్ కాంగ్రెస్​
author img

By

Published : Jan 13, 2021, 6:42 PM IST

ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బంగాల్​ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు సీఎం పీఠం తమదేనంటూ భాజపా సవాల్​ విసురుతోంటే... అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్​ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పటి ప్రత్యర్థి అయిన వామపక్షాల సాయాన్నీ కోరుతోంది.

"కాంగ్రెస్​-వామపక్షాల కూటమి నిజంగా భాజపా వ్యతిరేకులైతే వారు తప్పకుండా మమతా బెనర్జీకి మద్దతుగా నిలవాలి. కుల రాజకీయాలకు అడ్డు చెప్పేందుకు మమత చేస్తోన్న పోరాటంలో అండగా ఉండాలి."

-సౌగతా రాయ్, తృణమూల్ ఎంపీ.

ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన పథకాలేవీ సఫలం కాలేదని రాయ్​ పేర్కొన్నారు. ​బంగాల్​లో కలకలం సృష్టించిన పశువుల అక్రమ రవాణాపై స్పందించిన రాయ్... ఇది కేవలం రాష్ట్ర పోలీసులకు సంబంధించిన సమస్య కాదని, కేంద్రం అధ్వర్యంలో పనిచేసే బీఎస్​ఎఫ్​ సైనికులు దాన్ని అడ్డుకోవాలని అన్నారు. ఇదే విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పై ధ్వజమెత్తారు. "సరిహద్దుల్లో బీఎస్​ఎఫ్​ సైనికులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారో లేదా చూడాలి కానీ, రాష్ట్రాల్లో పర్యటిస్తూ భోజనంపై శ్రద్ధ పెట్టడం ఏంటి?" అని ఎద్దేవా చేశారు.

సిసిర్​ అధికారిపై వేటు....

మరోవైపు... తృణమూల్​ కాంగ్రెస్​ నేత సువేందు అధికారి భాజపాలో చేరి దాదాపు నెల రోజులవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, లోక్ సభ ఎంపీ సిసిర్ అధికారిని తూర్పు మిద్నాపూర్​ జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించింది తృణమూల్ కాంగ్రెస్. తొలుత దిఘా-శంకర్​పూర్ డెవలప్​మెంట్​ అథారిటీ ఛైర్మన్​ పదవి నుంచి సిసిర్​ను తొలగించిన టీఎంసీ మరో పదవి నుంచి అతన్ని తొలగించడం గమనార్హం.

టీఎంసీకి మరో దెబ్బ!

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తృణమూల్​ కాంగ్రెస్​ మాజీ ఎంపీ కేడీ సింగ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. దర్యాప్తునకు సహకరించట్లేదని ఆల్కెమిస్ట్​ లిమిటెడ్​ వ్యవస్థాపకుడైన సింగ్​ను అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది.

మనీలాండరింగ్​కు సంబంధించి తొలుత సింగ్​పై కోల్​కతా పోలీసులు కేసు నమోదు చేశారు. భారత మార్కెట్​ నియంత్రణాధికార సంస్థ (సెబీ) సింగ్​పై మరో కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చదవండి:మొదటి స్వదేశీ మెషీన్ గన్​ అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.