ETV Bharat / bharat

పులుల సంఖ్యలో ఏటా 6 శాతం వృద్ధి

దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సంవత్సరానికి 6 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. గత 8 ఏళ్లలో 750 పులులు మరణించినట్లు పేర్కొంది.

author img

By

Published : Jun 7, 2020, 5:29 AM IST

Tiger population on road to recovery with annual growth of 6%: Govt
పులుల సంఖ్యలో ఏటా 6 శాతం వృద్ధి

భారత్​లో పులుల సంఖ్య సంవత్సరానికి 6 శాతానికి పైగా వృద్ధి చెందుతోందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. 2006 నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు సర్వేల్లో ఈ విషయం స్పష్టమైనట్లు పేర్కొంది. గత కొన్నేళ్లలో జరిగిన సహజ నష్టాల నుంచి కోలుకొని పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది.

ఓ వార్తా సంస్థ దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు స్పందనలో భాగంగా ఈ విషయాలు వెల్లడించింది పర్యావరణ శాఖ. దేశంలో గత 8 ఏళ్లలో 750 పులులు మరణించాయని మంత్రిత్వ శాఖ స్పష్టం తెలిపింది. సహజ మరణాలు, ప్రమాదాలు, వేట, ఘర్షణలు వంటి వివిధ కారణాల వల్ల ఇవి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది.

"నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్​టీసీఏ)తో కలిసి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పులుల సంఖ్య క్రమంగా కోలుకుంటోంది. నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. వార్షికంగా 6శాతం మేర వృద్ధి రేటు నమోదవుతోంది. సహజ నష్టాల నుంచి కోలుకొని పులుల సంఖ్య పెరగడానికి ఇది దోహదపడుతుంది."

-పర్యావరణ మంత్రిత్వ శాఖ

పులుల వేటను నియంత్రించేందుకు 'ప్రాజెక్ట్ టైగర్'​ కింద అనేక చర్యలు చేపడుతున్నట్లు పర్యావరణ శాఖ వెల్లడించింది. దేశంలోని పులుల సంఖ్యను పారదర్శకంగా లెక్కించి గణాంకాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా 'టైగర్​నెట్.ఎన్​ఐసీ.ఐఎన్'​ వెబ్​సైట్​లో పొందుపర్చుతున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.