ETV Bharat / bharat

'3 సార్లు పరీక్షిస్తేనే పక్కాగా బీపీ లెక్క'

రోగి రక్తపోటు ఎంతుందో కచ్చితంగా తెలియాలంటే కనీసం మూడుసార్లు పరీక్షించాలని తాజా అధ్యయనంలో తేలింది. తప్పుడు రోగ నిర్ధరణ కాకూడదంటే ఇది తప్పదంటున్నారు పరిశోధకులు.

సరైన బీపీ కోసం 3సార్లు పరీక్షించాలి
author img

By

Published : Apr 15, 2019, 11:49 AM IST

బీపీ నిర్ధరణ విషయంలో జరిగే లోటుపాట్లు తొలగాలంటే రోగికి కనీసం 3సార్లు రక్తపోటు పరీక్షించాలని తాజా అధ్యయనం చెప్తోంది. భారత ప్రజారోగ్య సంస్థ, భారత గణాంకాల సంస్థ ఆర్థిక, ప్రణాళిక విభాగం రక్తపోటుపై సంయుక్తంగా పరిశోధనలు చేశాయి. ఈ వివరాలతో ఎయిమ్స్ ఆధ్వర్యంలోని జర్నల్ ఆప్ హ్యూమన్ హైపర్​టెన్షన్​లో కథనం ప్రచురితమైంది.

అవసరం లేకున్నా చికిత్స...

సరైన అవగాహన లేకనో... రోగుల సంఖ్య అధికంగా ఉండి ఒత్తిడి వల్లనో... సాధారణంగా రక్తపోటు నిర్ధరణకు ఒకే ఒక్క పరీక్షను ప్రామాణికంగా తీసుకుంటున్నారు వైద్యులు. తద్వారా చాలా మందికి అధిక రక్తపోటు ఉందని నిర్ధరిస్తున్నారు. కొందరికి అవసరం లేకున్నా చికిత్స అందిస్తున్నారు.

"భారతదేశంలో చాలా మంది వైద్యులు సమయాభావం వల్ల ఒక బీపీ కొలతపైనే ఆధారపడుతున్నారు. అయితే రక్తపోటు శ్వాసక్రియ, భావోద్వేగం, వ్యాయామం, భోజనం, పొగాకు, మద్యం, పరిసరాల ఉష్ణోగ్రత, మూత్రాశయ వ్యాకోచం, నొప్పి తదితర అంశాల ప్రభావంతో క్షణక్షణం బీపీ మారుతుంటుంది. అందువల్ల వైద్యులు మూడుసార్లు బీపీ కొలిచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్న రోగుల విషయంలో."
-డాక్టర్ అంబుజ్ రాయ్, ప్రొఫెసర్, కార్డియాలజీ విభాగం, ఎయిమ్స్

అంచనాలు అందుకోలేక...

ఎక్కువసార్లు బీపీ పరీక్షించినప్పుడు తేలిన రోగుల సంఖ్యతో పోలిస్తే... ఒకేసారి పరీక్షించినప్పుడు అదనంగా 63 శాతం మందికి బీపీ అధికంగా ఉందని నిర్ధరణ అయిందని పరిశోధనలో తేలింది.

"అధిక రక్తపోటు నిర్ధరణ, నిర్వహణలో కచ్చితత్వం అవసరం. ఇందుకు సంబంధించి ఒకే విధమైన నిర్ధరిత పద్ధతులు రూపొందించాల్సి ఉంది. సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఎన్సీడీ సంరక్షణ సమన్వయకర్తలు తదితరులకు బీపీని మూడుసార్లు కొలవటానికున్న ప్రాధాన్యాన్ని వివరించి, సరైన సూచనలిచ్చి రోగులకు తగిన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి."
-డాక్టర్ దొరైరాజ్ ప్రభాకరన్, ఎయిమ్స్​

అందుకే 3 సార్లు...

అధిక రక్తపోటు నమోదైనప్పుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (ఎస్​బీపీ-గుండె కొట్టుకున్నప్పుడు), డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (డీబీపీ-గుండె విశ్రాంతి తీసుకునేప్పుడు) మధ్య సగటులో తేడాలు పెరిగాయని పరిశోధకులు గమనించారు. దీన్నిబట్టే రక్తపోటు నిర్ధరణకు కనీసం 3సార్లు పరీక్ష అవసరమని తేలుతోందని పరిశోధకులు అంటున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.