తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వేలాది మంది వలస కార్మికులు మహారాష్ట్ర ముంబయి వసాయ్ ప్రాంతంలోని మైదానంలో పగలంతా పడిగాపులు కాసారు. ఓవైపు కరోనా సోకుతుందనే భయం.. మరోవైపు మండే ఎండ.. ఇదీ వారి పరిస్థితి. వసాయ్ రైల్వేస్టేషన్ నుంచి ఉత్తర్ప్రదేశ్ వెళ్లేందుకు ఆరు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో వలస కూలీలు వేల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
మొత్తం 3,060 శ్రామిక్ రైళ్లు...
దేశవ్యాప్తంగా మే 25 వరకు మొత్తం 3,060 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి:''మహా' ప్రభుత్వ నిర్ణయాలతో మాకే సంబంధం లేదు'