కర్ణాటకలో తన విధులపట్ల అమితమైన అంకితభావం చూపించారో జిల్లా పాలనాధికారి. చిన్నతనం నుంచి ప్రేమను చూపి లాలించిన తాతయ్య అంత్యక్రియలా..? వరద బాధితుల సహాయమా..? అన్న ప్రశ్న ఉత్పన్నమయితే నిరాశ్రయులను రక్షించేందుకే మొగ్గు చూపారు. తాతయ్యను కడసారి కూడా చూడకుండా బాధితులకు సేవలందించారు. అంకిత భావానికి ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది.
రాష్ట్రంలో కృష్ణా, బీమా నదులు ఉప్పొంగడం వల్ల వరదముంపులో చిక్కుకుపోయిన వారిని రక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు విజయపుర జిల్లా పాలనాధికారి వైఎస్ పాటిల్. వారం రోజులుగా ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాతయ్య చనిపోయినా అంత్యక్రియలకు వెళ్లకుండా బాధితులకు సహాయం అందించడంలో అంకిత భావాన్ని చూపారు.
ఇదీ చూడండి: శునకాల స్వైరవిహారం.. వెనక్కి మళ్లిన విమానం!