భాజపాను ప్రతినాయకులతో పోలుస్తూ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్లోని ఢోల్కా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ మాజీ క్రికెటర్.. ప్రధాని నరేంద్రమోదీపై పరోక్ష విమర్శలు చేశారు.
"సముద్ర గర్భంలో చైనా రైల్వే మార్గం నిర్మిస్తోంది. అంగారకుడిపై జీవం మనుగడపై అమెరికా పరిశోధనలు చేస్తోంది. మర సైనికులను రూపొందించే ప్రయత్నాల్లో రష్యా ఉంది. భారత్లో మాత్రం దొంగ కాపలాదారుల తయారీ జరుగుతోంది."
-నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత
ప్రస్తుత లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే రాముడు - రావణుడు , శ్రీకృష్ణుడు-కంసుడు, గాంధీ-గాడ్సేల మధ్య పోరును చూసినట్టు ఉందని సిద్ధూ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్