మూడు గంటలు... 250 కి.మీ.ల దూరం... అడ్డొచ్చే ట్రాఫిక్... ఇవీ ఓ పసిపాప ప్రాణాన్ని కాపాడడానికి ఆ అంబులెన్స్ డ్రైవర్ ముందున్న సవాళ్లు. ఈ అడ్డంకుల్ని చూసి వెనుకంజ వేయలేదు అతడు. సాహసంతో కదిలాడు. కళ్లు చెదిరే వేగంతో గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు.
ఎలా సాధ్యమైంది?
కర్ణాటక చిక్కమగళూరుకు చెందిన ఓ అంబులెన్స్ డ్రైవర్.. రెండు నెలల చిన్నారి చికిత్స కోసం వేరే ప్రాంతానికి తరలించేందుకు పోలీసుల సాయాన్ని కోరాడు. అందుకు అంగీకరించిన పోలీసులు.. రోడ్డుపై ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకున్నారు. తద్వారా అంబులెన్స్‌ను కేవలం మూడు గంటల్లోనే.. శివమొగ్గ నుంచి మంగళూరుకు చేర్చాడు.
అంతకుముందు శివమొగ్గలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి.. ఇప్పుడు మంగళూరు ఆసుపత్రికి సురక్షితంగా చేరింది. పసిపాపకు ప్రాణ ముప్పు తప్పించిన అంబులెన్స్ డ్రైవర్ కృషిని నెట్టింటా అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇదీ చూడండి:రామచిలుకల పట్ల ఈ దంపతుల ప్రేమ వారెవ్వా!