ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళలో కాశీ అన్నపూర్ణ ఈ బామ్మ! - హోటళ్లు

పొట్ట కూటి కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లి కరోనా ధాటికి చిక్కుకున్న వారు ఎందరో. చేసేందుకు పనులు లేక, సమయానికి తిండి అల్లాడుతున్న కూలీల అవస్థలు దారుణం. అలాంటి వారికి అండగా నేనున్నానంటూ నిలిచింది ఎనిమిది పదుల వయసున్న ఓ బామ్మ.

this 82 years old woman distribute food for poor people
లాక్​డౌన్​ వేళలో కాశీ అన్నపూర్ణ ఈ బామ్మ!
author img

By

Published : Apr 14, 2020, 2:46 PM IST

Updated : Apr 14, 2020, 3:11 PM IST

కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ కట్టుదిట్టుంగా అమలు అవుతోంది. హోటళ్లు, దుకాణాలు, తినుబండారాల షాపులు, అన్నీ మూతపడ్డాయి. ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయ్యారు. మొత్తం పరిసరాలన్నీ బోసిపోయాయి. కానీ.. అక్కడ మాత్రం కోలాహలంగా ఉంది. అందరూ రకరకాల పనుల్లో నిమగ్నమై సందడి వాతావరణం నెలకొంది. ఒకరు కూరగాయలు తరుగుతుంటే.. మరొకరు పెద్ద పాత్రలో అన్నం వండుతున్నారు. మరొకరు స్వీట్లు చేసేస్తున్నారు. ఆ పక్కనే ఓ పెద్దావిడ కుర్చీలో కూర్చొని పూరీలు చేస్తోంది. కాసేపటికి వండిన వంటల్ని డబ్బాల్లో సర్దుతున్నారు. దేశం మొత్తం అన్నీ రకాల కార్యకలాపాలు మూతపడగా వీరేంటి ఇలా వేడుక నిర్వహిస్తున్నారు అని అనుకుంటున్నారా!

అవునుండీ మీరు చదివింది నిజమే! రకరకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారక్కడ. కానీ అవేవి ఏ వేడుకకో తరలిస్తున్నవి కావు. లాక్​డౌన్​ వేళ.. అన్నార్తుల కోసం ఓ బామ్మ పడుతున్న ఆరాటం. వారణాసికి చెందిన విమలా దివన్​ 82 ఏళ్ల వృద్ధురాలు. అధ్యాపకురాలిగా ఎందరి జీవితాలనో తీర్చిదిద్దారామె. విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్న ఈ బామ్మ ఈ వయసులోనూ ఎంతో మంది కడుపు నింపేందుకు నేను సైతం అంటూ ముందుకొచ్చింది.

కూలీల పాలిట అన్నపూర్ణ

కరోనా మహమ్మారి కారణంగా పని దొరక్క పస్తులతో రోజులను గడుపుతున్న కూలీల పాలిట అన్నపూర్ణగా మారిందీ బామ్మ. తన పెన్షన్​ సొమ్ముతో ఈ బృహత్కార్యాన్ని చేస్తున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ స్వయంగా వండుతున్నారు కూడా. ఈ పెద్దావిడ పెద్ద మనసు.. ఆమె ఉంటున్న కాలనీవాసులనూ కదిలించింది. వారంతా ఆమెతో చేయి కలిపారు.

క్యాన్సర్​ బారిన పడి

క్యాన్సర్​ బారిన పడి అయిదేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి గెలిచారు ఈ బామ్మ. క్యాన్సర్​నే జయించిన నేను ఈ కరోనాకు అస్సలు భయపడనని చెబుతున్నారు విమల. ఈ ఆపత్కాలంలో తనకు తోచిన సాయం చేస్తా అని చెబుతోంది ఈ బామ్మ.

ఇదీ చదవండి: రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళులు

Last Updated : Apr 14, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.