ETV Bharat / bharat

'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'

కరోనా మహమ్మారి రాజ్యమేలుతున్న నేటి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఏది తింటే ఎలాంటి అనర్థాలు వస్తాయోనని భయం. ఈ తరుణంలో ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం...

NUTRIENT FOOD
'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'
author img

By

Published : Apr 6, 2020, 11:41 AM IST

ఏదో ఒకటి తినడం కాదు.. సమస్యకు సూటిగా పరిష్కారం చూపించే ఆహారం తినడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్‌ బి, సి వంటి వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్లతో సహా మాంసకృత్తులు వంటి మహారాజ పోషకాలను తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

విటమిన్​ సి:

ఇది ఎక్కువగా పండ్లు, కాయగూరల నుంచే లభ్యమవుతుంది. నిమ్మకాయ, పచ్చిమామిడి, జామకాయలో విటమిన్‌-సి మెండుగా ఉంటుంది. అవి దొరకని సందర్భంలో మొలకలు చక్కటి ప్రత్యామ్నాయం. పెసలు, సెనగలు, రాగులు, గోధుమలతో మొలకలు చేసుకోవచ్ఛు ఇవి పోషకభరితమైనవి. రోజూ కప్పు మొలకలు తీసుకుంటే సరి. వీటితోపాటు టమాట, క్యాప్సికమ్‌, కీర, క్యాబేజీలను బాగా కడిగి తినాలి.

బి విటమిన్లు:

ఇడ్లీ, దోసె వంటి ఫెర్మెంటేషన్‌ చేసిన ఆహారం నుంచి, దంపుడు బియ్యం, కొర్రలు, సామలు, అరికెలు లాంటి చిరుధాన్యాల నుంచి అన్నిరకాల బి విటమిన్లు అందుతాయి. మొలకల నుంచి కూడా ఇవి లభ్యమవుతాయి.

మాంసకృతులు:

పొట్టుతో ఉన్న పప్పు దినుసుల్లో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. పెసలు, సెనగలు, అలసందలు, బొబ్బర్లు, బఠానీలు, రాజ్మా నుంచి అందుతాయి. నువ్వులు, పల్లీలకు బెల్లం కలిపి లడ్డూలు, చిక్కీలు లాంటివి చేసుకోవచ్ఛు పుట్నాల పప్పు కూడా మంచిదే. ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో ఉండే ఆహారం గుడ్ఢు దీన్ని బాగా ఉడికించి తీసుకోవడం తప్పనిసరి. మాంసాహారం తిననివారు సోయానగ్గెట్స్‌, మీల్‌ మేకర్‌ వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే మాంసకృత్తులు అందుతాయి.

ఇదీ చదవండి: కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. ఇవి తింటే చాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.