ETV Bharat / bharat

'భారత్​లో అటువంటి వైరస్​ ఏం లేదు' - కొత్త వేరియంట్​పై కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో దక్షిణాఫ్రికా ​వేరియంట్​ కొవిడ్ వ్యాప్తిపై కేంద్రం స్పందించింది. అటువంటి వైరస్​ ఉన్నట్లు ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​ స్పష్టం చేశారు.

covid, bharat, south africa
'భారత్​లో అటువంటి వైరస్​ ఏం లేదు'
author img

By

Published : Feb 9, 2021, 6:07 PM IST

భారత్​లో దక్షిణాఫ్రికా వేరియంట్​ కొవిడ్​ వ్యాప్తి జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం స్పష్టం చేసింది. ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈమేరకు వెల్లడించారు.

దేశంలో ఇప్పటివరకు 63,10,194 కొవిడ్​ టీకాలు అందించామని వెల్లడించారు భూషణ్. ఏడు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో గత మూడు వారాలుగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు. 15 రాష్ట్రాల్లో సోమవారం కరోనా వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పారు.

ఇంకా 70 శాతం..

సెరో సర్వే ప్రకారం దేశంలో ఇంకా 70 శాతం మందికి కరోనా సోకే అవకాశం ఉందని భూషణ్​ పేర్కొన్నారు. దేశంలోని 71శాతం కరోనా కేసులు కేరళ, మహారాష్ట్రాల్లో నమోదైనవేనని అన్నారు. ఇందులో కేరళ 45.72, మహారాష్ట్ర 25.06 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. ​

ఇదీ చదవండి : సాగు చట్టాల రద్దుకు లోక్​సభలో కాంగ్రెస్ బిల్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.