ETV Bharat / bharat

'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?

అమెరికా హ్యూస్టన్ నగరంలో 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయుల నడుమ జరగబోయే ప్రతిష్టాత్మక కార్యక్రమం 'హౌడీ మోదీ'. ఈ సభ తర్వాత భారత్​-అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఎప్పటి నుంచో తెగని పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?
author img

By

Published : Sep 22, 2019, 2:52 PM IST

Updated : Oct 1, 2019, 2:05 PM IST

"నేను ప్రచారం పొందడానికి కారణం గర్వమే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. ఎప్పుడూ ప్రజలు వారికి వారు గొప్పగా ఊహించుకుంటారు. అయితే ఎవరైనా గొప్పపని చేస్తే ఆశ్చర్యపోతారు. ఇలాంటి అద్భుతాలు ఎవర్నీ బాధపెట్టవు. ఏదైనా విషయం గొప్పది, అద్భుతమైనది అని ప్రజలు నమ్మాలనుకుంటారు."

- డొనాల్డ్​ ట్రంప్​ (ట్రంప్​: ద ఆర్ట్​ ఆఫ్​ డీల్​)

భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి హౌడీ మోదీ వేదికను పంచుకునేందుకు డొనాల్డ్​ ట్రంప్​ హ్యూస్టన్​ వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. బిలియనీర్​ వ్యాపారి... టెలివిజన్​ స్టార్​ అయిన అమెరికా అధ్యక్షుడు ఈ వేదికపై భారత్​తో విదేశాంగ విధానాలపై ఏదైనా ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు.

టెక్సాస్​ పట్టు చిక్కేనా...

2016లో టెక్సాస్​ ఎన్నికల్లో ట్రంప్​ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అదే టెక్సాస్​లో ఈ సభ విజయవంతమవడం ట్రంప్​కు కలిసొచ్చే అంశం. మిషిగన్​, పెన్సిల్​వేనియా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్​ పార్టీకి ట్రంప్​ విజయం దక్కేలా చూశారు. ఈ రెండు రాష్ట్రాల్లో 1988 నుంచి రిపబ్లికన్లకు ఇదే మొదటి విజయం. అయితే ఇవి తిరిగి డెమొక్రాట్ల చేతిలోకి వెళ్లిపోయాయి.

2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే పైచేయిగా మారింది. ఇప్పుడు 2020 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్​ సమాయత్తమవుతున్నారు. ఈ సమయంలో ట్రంప్​కు ప్రతి ఓటు అవసరం. టెక్సాస్​ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ డెమొక్రాట్స్​ వైపు గాలీ వీస్తోంది.

ప్రస్తుతం ట్రంప్​ పాపులారిటీ రేటింగ్స్​ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆధునిక చరిత్రలో గాలప్స్​ వీక్లీ సర్వే​​లో 50% మార్క్​ను అందుకోని ఏకైక అధ్యక్షుడు ట్రంప్. అమెరికన్లు ట్రంప్​ పనితనాన్ని ఏ విధంగా గమనిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రస్తుతం ట్రంప్​ రేటింగ్​ 44.3% ఉంది. అయితే ఇది ఒబామా రెండోసారి ఎన్నికైనప్పుడు (2011 సెప్టెంబర్)​​ కంటే ఎక్కువే. ఇది రిపబ్లికన్​ పార్టీ ఎన్నికల ప్రచారానికి బలమిచ్చే అంశమే.

ట్రంప్​.. ఒబామాకు తేడా...?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ ఇప్పటివరకు భారత్​లో అడుగుపెట్టలేదు. బరాక్​ ఒబామా మాత్రం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు సార్లు దిల్లీ వచ్చారు. 2015 భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే హ్యూస్టన్‌ నగరంలో 50,000కు పైగా ప్రవాస భారతీయుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమానికి ట్రంప్​ హాజరవడం ఆషామాషీ విషయం కాదు. భారతీయుల్లో మోదీ గాలి బలంగా వీస్తున్న ఈ తరుణంలో అమెరికాలోని ప్రవాసులకు దగ్గరవడం ట్రంప్​కు కలిసొచ్చే విషయం. ఎందుకంటే రికార్డు స్థాయి మెజారిటీతో మోదీ రెండోసారి ఎన్నికయ్యారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం అక్కడ మానవహక్కుల పరిస్థితిపై అమెరికా చట్టసభ్యులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మోదీతో ట్రంప్​ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రవాసుల ప్రభావం...

భారతదేశం నుంచి అక్రమ వలసదారులను బహిష్కరించడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించే ప్రవాసులు సంప్రదాయకంగా డెమొక్రాట్లకు ఓటు వేస్తున్నారు. హెచ్1బీ వీసాలు, వలస నిబంధనల సమీక్షపై ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలతో వీరంతా అయోమయంలో ఉన్నారు.

అమెరికన్ రాజకీయాల్లో ప్రవాస భారతీయుల ప్రభావం గణనీయంగానే ఉంది. అమెరికా జనాభాలో దాదాపు ఒక శాతం వరకు ఉన్న మైనారిటీ ఆసియా సమాజంలో భారతీయులే అధికులు.

ట్రంప్ 24 మందికిపైగా భారతీయ-అమెరికన్లను తన ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. అయితే ఒబామా తన అధ్యక్ష పదవిలో ఎనిమిది సంవత్సరాల కాలంలో 50 మంది భారతీయ-అమెరికన్లను బాధ్యతాయుతమైన పదవుల్లో నియమించారు.

"విభిన్న రంగాలలో ప్రవాస భారతీయులు సాధించిన విజయాలు, వివిధ రంగాలలో అమెరికాకు వారు అందించిన సహకారం, భారతదేశంతో వారికున్న బలమైన బంధాలు, భారత్​, అమెరికా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య వంతెనగా వారు పోషిస్తోన్న పాత్ర మాకు గర్వకారణం.

అమెరికా అధ్యక్షుడు, నేను కలసి ప్రవాస భారతీయులతో అవుతున్న మొదటి భేటీ ఇది. ఇది ఓ సరికొత్త మైలురాయి.”

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

మోదీ, ట్రంప్​లో పోలికలు...

ప్రపంచంలోని శక్తిమంతమైన పురాతన ప్రజాస్వామ్య దేశాలకు చెందిన ఈ ఇద్దరు అధినేతల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. ట్రంప్​, మోదీ ఇద్దరూ ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా అత్యున్నత పదవిని అలంకరించారు. రాజకీయ వారసత్వం ఉన్న ప్రత్యర్థులపై గెలిచారు.

ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇరువురూ సామాజిక మధ్యమాలను విశేషంగా ఉపయోగించారు. ఇద్దరూ మీడియాతో వ్యవహరించే విధానాల్లోనూ పోలికలు ఉన్నాయి. మోదీ ఇప్పటికీ విలేకరుల సమావేశాలకు దూరంగా ఉంటారు.

అసత్య, తప్పుడు వార్తలు వ్యాప్తిని అరికట్టేందుకు ట్రంప్​ మీడియాతో కఠినంగా వ్యవహరిస్తారు. అలానే వారి నినాదాల్లోనూ పోలికలు ఉన్నాయి. మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఇస్తే... ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనేది ట్రంప్ మాట.

మోదీ- ట్రంప్​ బంధం...

ట్రంప్ చాలా మంది అగ్రశ్రేణి ప్రపంచ నాయకులతో ఇబ్బందికరంగా కరచాలనం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మోదీ విషయానికి వచ్చేసరికి ట్రంప్​ వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. కరచాలనం, హత్తుకునే విధానంలో అభిమానం తొణికిసలాడుతుంది.

ఈ మధ్య జీ-7 సదస్సులో భాగంగా ఇరువురు అగ్రనేతలు ఒకరిపై ఒకరు విసురుకున్న చమత్కార బాణాలే ఇందుకు నిదర్శనం.

ట్రంప్​ ముందున్న అడ్డంకులు...

ఉద్యోగ కల్పన, చైనాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించడం, అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ... ఇవన్నీ ట్రంప్​ ఎన్నికల్లో ఇచ్చిన పెద్ద వాగ్దానాలు. అయితే వీటిని సాధించడానికి, వాణిజ్య అంతరాలను తగ్గించడానికి , దక్షిణాసియాలో స్థిరమైన వాతావరణం నెలకొనడానికి భారత్​ పోషించాల్సిన పాత్ర ముఖ్యమైనది. అఫ్గాన్​ తాలిబన్లతో శాంతి ఒప్పందం చర్చలు ప్రస్తుతం పట్టాలు తప్పిన ఈ సందర్భంలో భారత్​తో స్నేహం ట్రంప్​కు కీలకం.

సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో మోదీతో జరగబోయే అధికారిక ద్వైపాక్షిక చర్చలకు హ్యూస్టన్​లోనే ఓ మంచి వాతావరణం నెలకొల్పనున్నారు ట్రంప్. అప్పుడు ఆ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య విభేదాలు తొలిగే అవకాశం దొరుకుతుంది.

“మేమిద్దరం త్వరలో చాలా పెద్ద ప్రకటనలు చేయబోతున్నామని నేను భావిస్తున్నాను. చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం. వాణిజ్య పరంగా, తయారీ పరంగా మేము భారతదేశంతో కలిసి పనిచేస్తున్నాము. ” - ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఒసాకాలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ విధంగా ప్రకటించారు.

మోదీ, ట్రంప్ పాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిస్తారా? జీఎస్పీ (అత్యంత ప్రాధాన్య హోదాను) తిరిగి పొందడానికి భారత్ ప్రయత్నిస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉంది.

ప్రస్తుతం భారత్​, అమెరికా ఈ సభను తీక్షణంగా గమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. హౌడీ మోదీ సభలో ఏం ప్రకటనలు వెలువడతాయోనని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

- స్మితా శర్మ, సీనియర్​ జర్నలిస్ట్​

Mumbai, Sep 22 (ANI): While speaking to media on Prime Minister Narendra Modi's tweet on campaign of 'Coolie No. 1' team towards single-use plastic, Bollywood actor Varun Dhawan said, "We would like to thank Prime Minister Narendra Modi for acknowledging our efforts. It is responsibility of all of us towards our nation and universe that if we want to stop global warming and save our environment then we should take such small steps." "My main aim is that I always try to bring some initiative with every film so that I can contribute little bit for the nature," Dhawan added.
Last Updated : Oct 1, 2019, 2:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.